దేవ్ మోహన్ మ్యానియాలో టాప్ హీరోయిన్స్ !
ఇప్పటికే పెళ్ళి చేసుకున్న నయనతార త్వరలోనే తల్లిగా మారి సినిమాలకు దూరం అవుతుంది అన్నప్రచారం జరుగుతోంది. దీనితో లేడీ సూపర్ స్టార్ స్థానం పై సమంత రష్మిక ల దృష్టి పడింది. ఈనెల 14న విడుదలకాబోతున్న ‘శాకుంతలం’ మూవీలో సమంత నట విశ్వరూపం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి హీరోయిన్ ఒరియేంటెడ్ సినిమాకు ఆమె పక్కన నటించడానికి హీరోలు ఎవరూ దొరకని పరిస్థితులలో గుణశేఖర్ చాల ఆలోచించి మళయాళ హీరో దేవ్ మోహన్ ఎంపిక చేసాడు.
దీనికి కొనసాగింపుగా రష్మిక నటిస్తున్న మరొక హీరోయిన్ ఒరియేంటెడ్ మూవీ ‘రైన్ బో’ మూవీ కూడ హీరోయిన్ ఒరియేంటెడ్ మూవేగా తీస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక పక్కన హీరోగా నటించడానికి హీరోలు ఎవ్వరూ ముందుకురాని పరిస్థితులలో మళ్ళీ ఆసినిమా నిర్మాతలకు దేవ్ మోహన్ దేవుడుగా కనిపించాడని టాక్. ఇలాంటి పరిస్థితులలో భవిష్యత్ లో చాలామంది టాప్ హీరోయిన్స్ నటించబోయే హీరోయిన్ ఒరియేంటెడ్ సినిమాలలో హీరోగా నటించే విషయంలో దేవ్ మోహన్ మాత్రమే పరిష్కారంగా కన్పిస్తున్నాడు అంటూ ఇండస్ట్రీలోని కొందరు కామెంట్స్ చేసుకుంటున్నట్లు టాక్.
ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ స్థానంలో కొనసాగుతున్న చాలామంది హీరోయిన్స్ కు తమ హీరోయిన్ ఒరియేంటెడ్ సినిమాలలో హీరోగా నటించే విషయంలో ఒక్క దేవ్ మోహన్ తప్ప మరొక ఆప్క్షన్ అప్పటితరం ప్రతినిధులకు తెలిసేలా పరిస్థితులు ఏర్పడ్డాయి అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా ఉండగా హీరోయిన్ ఒరియేంటెడ్ సినిమాలకు సంబంధించి సరైన అవగాహన లేకపోవడంతో చాలామంది హీరోలు అలాంటి సినిమాలలో నటించడానికి ఆశక్తి కనపరచడం లేదు అన్న మాటలు కూడ వినిపిస్తున్నాయి..