మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న రవితేజ తాజాగా వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన "రావణాసుర" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తుంది. అలాగే ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను కూడా విడుదల చేయగా అవి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ప్రస్తుతం అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా స్పెషల్ షో కు సంబంధించిన ఒక అప్డేట్ ను ప్రకటించింది.
ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన ఉదయం 8 గంటల 30 నిమిషాలకు శ్రీరాములు థియేటర్ లో స్పెషల్ షో వేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో టాలీవుడ్ యువ నటుడు సుశాంత్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుండగా ... అను ఇమాన్యుయల్ , పూజిత పొన్నాడ , దక్ష నాగర్కర్ , మెఘ ఆకాష్ , పరియా అబ్దుల్లా ఈ మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు.