'దిల్' సినిమాలో నటించిన వీరు.. ఇప్పుడు ప్రాణాలతో లేరు తెలుసా?
ఇక ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు కావొస్తుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ సినిమాలో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా ఇక ఇప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం..
ఎమ్మెస్ నారాయణ : దిల్ సినిమాలో ప్రిన్సిపల్ పుల్లారావు పాత్రలో నటించి నవ్వులు పూయించారూ. ఎమ్మెస్ నారాయణ 2017 లో ప్రాణాలు వదిలారు.
చలపతిరావు : హీరో నితిన్ తండ్రి పాత్రలో నటించారు చలపతిరావు. ఇక ఇది సినిమా కథకు కీలకమైన పాత్ర. 2022 డిసెంబర్లో ఆయన మరణించారు.
వేణుమాధవ్ : ఈ సినిమాలో హీరో మామయ్య పాత్రలో నటించాడు వేణుమాధవ్. ఇక అందర్నీ కడుపుబ్బ నవ్వించాడు. 2019లో వేణుమాధవ్ అనారోగ్య సమస్యలతో మరణించాడు.
రాజన్ పి దేవ్ : హీరోయిన్ నేహా కు తాత పాత్రలో నటించాడు రాజన్ పి దేవ్. 2009లో ఈయన మరణించారు.
రాళ్లపల్లి : ఈ సినిమాలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఎంప్లాయ్ గా కనిపించారు రాళ్లపల్లి. ఈయన 2019లో మరణించారు.
ఆహుతి ప్రసాద్ : దిల్ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడు ఆహుతి ప్రసాద్. ఈయన 2017లో అనారోగ్య సమస్యలతో ప్రాణాలు వదిలారు. ఇలా 20 ఏళ్ల క్రితం నితిన్ దిల్ సినిమాలో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా ఇక ఇప్పుడు ప్రాణాలతో లేరు అని చెప్పాలి.