ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాతల్లో ఒకరిగా కొనసాగుతున్నారు దిల్ రాజు. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు అప్పుడప్పుడు చిన్న సినిమాలను సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తున్న ఈ స్టార్ ప్రొడ్యూసర్ త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలు రావడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. ఈ మధ్య నిజామాబాదులో దిల్ రాజు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ముఖ్యంగా తన సొంతూరు నర్సింగ్ పల్లి లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించారు. అంతేకాకుండా ఆలయంలో చిన్న పిల్లలకు, గర్భిణులకు ఆయుర్వేద మందులను కూడా అందిస్తున్నారు.
మరోవైపు తన కుమార్తె హన్సిత అలాగే తన సోదరుడు కుమారుడు హర్షిత్ నిర్మించిన బలగం సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో కేటీఆర్ దిల్ రాజుని పొగడ్తలతో ముంచేత్తడమే కాకుండా రాజకీయాల్లోకి రావాలని కోరినట్లు ప్రచారం మొదలైంది. దీంతో దిల్ రాజు త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు వైరల్ గా మారాయి.అయితే ఎట్టకేలకు తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత దిల్ రాజు. ఈ మేరకు దిల్ రాజు తన పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ..' సినీ జీవితంలోనే నన్ను విమర్శిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. ఇక రాజకీయాల్లోకి వస్తే తట్టుకోగలనా.
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాలకు వచ్చేదే లేదు' అంటూ తెగేసి చెప్పేసారు దిల్ రాజు. ఆయనకి రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉన్నా.. రాజకీయాల్లోకి వస్తే భారీగా విమర్శలు ఎదుర్కోవాలి. కానీ ఆ రిస్క్ ని దిల్ రాజు చేయదలుచుకోలేదు. కాబట్టి ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా దిల్ రాజు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు. ఇక ప్రస్తుతం దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'గేమ్ చేంజర్' మూవీ ఒకటి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ని విడుదల చేయగా.. ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీకి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు...!!