ఎస్ఎస్ఎంబి28 : మూవీ అమెరికా థియేటర్ హక్కుల ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Pulgam Srinivas
ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. ఈ మూవీ కి ఇప్పటి వరకు ఈ సినిమా బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 మూవీ గా రూపొందుతున్న కారణంగా ఈ మూవీ యొక్క షూటింగ్ ను "ఎస్ ఎస్ ఎం బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం తెరకెక్కిస్తోంది.

ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... శ్రీ లీల ... పూజా హెగ్డే ఈ మూవీ లో మహేష్ సరసన హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా పూర్తి అయ్యింది.  కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన రాత్రి వేళ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ ను ప్రారంభించింది. ప్రస్తుతం కూడా ఈ మూవీ కి సంబంధించిన రాత్రి వేళ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ నుండి ఇప్పటికే మహేష్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేయగా ... ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అమెరికా థియేటర్ హక్కులను ఈ మూవీ యూనిట్ అమ్మివేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క అమెరికా థియేటర్ హక్కులను ఈ చిత్ర బృందం 14.50 కోట్లకు అమ్మివేసినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: