"హరిహర వీరమల్లు" విడుదలపై లేటెస్ట్ అప్డేట్..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల క్రితం హరిహర వీరమల్లు అనే మూవీ షూటింగ్ మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ను దాదాపు భీమ్లా నాయక్ సినిమాతో పాటు గానే పవన్ మొదలు పెట్టాడు. కాకపోతే ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ కొంత కాలం ఆగిపోయింది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి అయినట్లు తెలుస్తోంది. కేవలం ఈ సినిమాకు సంబంధించిన ఒకే ఒక షెడ్యూల్ షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం.

మరి కొన్ని రోజుల్లోనే ఈ బ్యాలెన్స్ షూటింగ్ ను కూడా మొదలు పెట్టి దానిని కూడా వీలైనంత త్వరగా పూ ర్తిచేసి ఆ తర్వాత ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టే ఆలోచనలో ఈ చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రసాదం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం ఈ చిత్ర బృందం ఈ సినిమాను ఈ సంవత్సరం విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ... అందుకు అనుగుణంగా ఈ మూవీ షూటింగ్ ను మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి.చేసే ప్రణాళికలను ఈ చిత్ర బృందం వేసుకుంటున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై పవన్ అభిమానులు భారీ లెవెల్లో అంచనాలను పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: