ఆ పాటతో తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ పెంచిన సల్లుబాయ్ మూవీ....!!

murali krishna
తెలంగాణ యాస, సంస్కృతీ సంప్రదాయాలు వెండితెరపై వెలుగులీనుతున్నాయి. తెలంగాణ నేపథ్యం సినిమాల్లో ప్రధాన ఆకర్షణ అవుతున్నది. ఐతే తాజా గా బాలీవుడ్‌ సినిమా 'కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌' చిత్రంలో బతుకమ్మ పాట ను తెరకెక్కించడం మన పూల పండగ దేశీయ ఖ్యాతికి నిదర్శనం.
హిందీ సినిమా లో బతుకమ్మ పాట ను రూపొందించడం ఇదే తొలిసారి.
సల్మాన్‌ ఖాన్‌ హీరో గా నటించిన ఈ చిత్రం లో  వెంకటేష్‌, పూజా హెగ్డే, భూమిక కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం నుంచి బతుకమ్మ పాట ను విడుదల చేశారు. ఈ పాట లో తెలుగు సాహిత్యాన్ని రాయడం విశేషం. 'ముంగింట్లో ముగ్గెట్టి గొబ్బిల్లే పెట్టుదామా..గడప కు బొట్టెట్టి తోరణాలు కట్టుదామా..గునుగూ తంగేడు పూలు, బంతి, చామంతి పూలు, తామర గుమ్మడి పూలు, దోసపూలు కట్లపూల తో గౌరమ్మ ను సిద్ధం చేసేద్దా మా..ప్రతి ఇళ్లూ బతుకమ్మ పండగ చేసేద్దా మా…' అంటూ సాగుతుందీ పాట.
ఈ పాట ను రవి బస్రూర్‌ స్వరకల్పన లో కిన్నల్‌ రాజ్‌, హరిణి ఇవటూరి సాహిత్యాన్ని అందించ గా..సంతోష్‌ వెంకీ పాడారు. ఫర్హాద్‌ సమ్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కాబోతున్నది. సల్మాన్‌ ఖాన్‌ సినిమా లో బతుకమ్మ పాట ను చిత్రీకరించడం పై ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు బతుకమ్మ క్రేజ్‌ పాన్‌ ఇండియా కు చేరింద ని సోషల్  పోస్ట్ ‌       ద్వా రా పేర్కొన్నారు.
ఐతే ఈ సినిమాలో వెంకటేష్ కూడా కీలక పాత్రలో చేస్తున్నారు. ఇంతకుముందు వెంకటేష్ రానా కలిసి చేసిన వెబ్ సిరీస్ ప్రేక్షకులలో నెగటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెల్సిందే. కనుక వెంకటేష్ ఈ సినిమా ద్వారా మళ్ళా బ్యాక్ టు వెంకీ కామెడీ అనిపించేలా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: