ఇక తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ హీరో రామ్ చరణ్ 38వ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27వ తేదీన ఆరెంజ్ సినిమాని థియేటర్లలోకి మళ్లీ రీ రిలీజ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన మగధీర సినిమాకు బదులుగా ఈ సినిమాని విడుదల చేయడం జరిగింది. మొదటిసారి రిలీజ్ అయినప్పుడు భారీ డిజాస్టర్ గా నిలిచిన ఈ మూవీ రీ రిలీజ్ లో మాత్రం చాలా భారీగానే కలెక్షన్స్ సాధించింది.ఈ నెల 27 వ తేదీన థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా దాదాపుగా 75 లక్షల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. తన ఆరెంజ్ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ చూసి ఈ సినిమా నిర్మాత చరణ్ బాబాయ్ ప్రముఖ టాలీవుడ్ నటుడు నాగబాబు చాలా సంతోష పడిపోయారు. తన సంతోషాన్ని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేశారు.
ఇక ఈ సందర్భంగా నాగబాబు ఆ వీడియోలో మాట్లాడుతూ.. చిరుత, మగధీర వంటి హిట్ సినిమాలతో మంచి జోష్లో ఉన్న రామ్ చరణ్ కి ఫ్లాప్ ఇచ్చాననే బాధ ఇన్ని రోజులు నాలో ఉండేది.ఇక ఈ సినిమాను రీ రిలీజ్ చేద్దామంటే నేను కాస్త ఆలోచించాను. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాకి గ్లోబల్ అవార్డు ఇంకా ఆస్కార్ అవార్డు రావడంతో ఆ ఉత్సాహంతో ఆరెంజ్ సినిమాను రీ రిలీజ్ చేద్దామనుకున్నాను. ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ ఇంకా వసూళ్లను చూస్తుంటే చాలా షాకింగ్ గా ఉంది.నా ఆరెంజ్ సినిమాకి ఇంతమంది అభిమానులున్నారా అని ఆశ్చర్యమేసింది. 2010 వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా పెద్దగా ఎవరికీ నచ్చలేదు. కానీ ఇప్పటి జనరేషన్ కి ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అయింది. అందుకే ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయని అన్నారు.
ఇక ఆరెంజ్ సినిమాని కూడా రామ్ చరణ్ హిట్ మూవీల్లో ఒకటిగా పరిగణించవచ్చు. నా వల్ల చరణ్ కి సక్సెస్ దూరమైందన్న బాధ నేటితో అంతా పోయింది. ఇదంతా కూడా రామ్ చరణ్ వల్లే సాధ్యమయ్యింది అని చెప్పుకొచ్చారు నాగబాబు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో ఆ వీడియో పై మీద మెగా అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.