తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరు అయినటువంటి
కొరటాల శివ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ క్రేజీ దర్శకుడు మిర్చి
మూవీ తో దర్శకుడు గా తన కెరీర్ ను మొదలు పెట్టి ఆ తర్వాత వరుసగా
శ్రీ మంతుడు ... జనతా గ్యారేజ్ ... భరత్ అనే నేను
మూవీ లతో భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల వరుసలో చేరిపోయాడు.
కొంత కాలం క్రితమే ఈ
మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్ర మ్యూజిక్ అందించనుండడం ... రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయనుండడం ...
జాన్వి కపూర్ మొట్ట మొదటి సారి తెలుగులో ఈ సినిమాలో నటిస్తూ ఉండడం ...
హాలీవుడ్ స్టంట్
మాస్టర్ లు ఈ
మూవీ కోసం పని చేస్తూ ఉండడం ఇలా
కొరటాల తన తదుపరి
మూవీ కోసం అదిరిపోయే సెటప్ ను చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ చూసినట్లు అయితే
కొరటాల ఈ
మూవీ తో మరో
బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకునే లాగానే కనిపిస్తుంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.