పూరి అన్వేషణలో సమాధానం దొరకని ప్రశ్నలు !

Seetha Sailaja
‘లైగర్’ ఘోర పరాజయం నుండి పూరీ జగన్నాథ్ కోలుకుని మరొక సినిమా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అతడి ప్రయత్నాలకు ఎక్కడా సరైన సపోర్ట్ హీరోల నుంచి అందడం లేదు అన్న సంకేతాలు వస్తున్నాయి. ఈమధ్య పూరీ చిరంజీవిని కలిసి చరణ్ కు ఒక కథ చెప్పాలని చాల గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు అన్న వార్తలు వచ్చాయి.

దీనితో నిరాశ పడకుండా రామ్ తో కలిసి ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీకి సీక్వెల్ చేయాలని పూరీ చేసిన ప్రయత్నాలకు కూడ రామ్ నుండి సరైన స్పందన రాలేదు అంటున్నారు. దీనితో పూరీ యూటర్న్ తీసుకుని బాలకృష్ణ వైపు వెళ్ళి అతడితో ఒక పొలిటికల్ సెటైర్ తీయాలని చేసిన ప్రయత్నాలు కూడ ముందుకు సాగలేదు అని అంటున్నారు. బాలయ్య దృష్టిలో బోయపాటి ఉండటంతో పూరీతో రిస్క్ ఎందుకు అనుకుని అతడిని పక్కకు పెట్టి ఉంటాడు అన్నకామెంట్స్ కూడ వస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితులలో తన కొడుకు ఆకాష్ పూరీ తో ఒక మూవీ చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ అతడి మార్కెట్ ఏమాత్రం బాగుండకపోవడంతో పూరీ ప్రయత్నాలు అక్కడ కూడ ముందుకు సాగడం లేదు అని అంటున్నారు. ఎందరో టాప్ హీరోలకు కెరియర్ బెస్ట్ సూపర్ హిట్లు ఇచ్చిన పూరీజగన్నాథ్ తన కొడుకును హీరోగా సెటిల్ చేయలేకపోవడం చాలామందికి షాక్ ఇచ్చే విషయం.

దీనితో ప్రస్తుతం పూరీ ఆలోచనలలో నాగచైతన్య ఉన్నాడు అన్న ప్రచారం జరుగుతోంది. చైతూ ఇండస్ట్రీలోకి వచ్చి పుష్కర కాలం దాటిపోయినా అతడి కెరియర్ కి సంబంధించి ఒక భారీ బ్లాక్ బష్టర్ హిట్ట్ ఇప్పటివరకు రాలేదు. మాస్ హీరోగా రాణించాలని చైతూ కల అయినప్పటికీ అతడు ఇప్పటిక్వరకు చేసిన ప్రయత్నాలు ఏవీ ముందుకు సాగలేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య చైతూ పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్ సెట్ కాగలిగితే పూరీ జగన్నాథ్ కు ఒక మార్గం దొరికింది అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: