"మీటర్" ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరు అయినటు వంటి కిరణ్ అబ్బవరం తాజాగా రమేష్ కాడూరి దర్శకత్వంలో రూపొందిన మీటర్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. సాయి కార్తీక్ ఈ పవర్ఫుల్ మాస్ యాక్షన్ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు.
 

ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం టీజర్ మరియు కొన్ని పాటలను కూడా విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదల తేదీకి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. మార్చి 29 వ తేదీన ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

ఈ చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీ ని ప్రకటిస్తూ విడుదల చేసిన ఈ పోస్టర్ లో కిరణ్ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఇన్షెట్ వేసుకొని స్పెడ్స్ పెట్టుకొని ఉన్నాడు. ప్రస్తుతం కిరణ్ కు సంబంధించిన ఈ వేరి స్టైలిష్ లుక్ లో ఉన్న పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయి రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ మూవీ తో మంచి సక్సెస్ ను అందుకున్న ఈ యువ హీరో మీటర్ అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: