ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో ఫర్జి..!!

Divya
ఈ మధ్యకాలంలో ఆడియన్స్ ఎక్కువగా చిత్రాల కంటే వెబ్ సిరీస్ ల పైన పలు ఆసక్తి చూపిస్తున్నారు.. ముఖ్యంగా లాక్ డౌన్ సమయం తర్వాత ఈ కల్చర్ కి ఎక్కువగా అలవాటు పడ్డారు ప్రేక్షకులు. పలు వెబ్ సిరీస్ ల పైన బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రేక్షకులు. హీరోయిన్లు సైతం ఈ వెబ్ సిరీస్ లలో నటించడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇప్పటికే స్టార్ హీరోలు అయినటువంటి అజయ్ దేవగన్, విజయ్ సేతుపతి, రాశి ఖన్నా, సమంత, వెంకటేష్, రానా నాగచైతన్య తమన్నా తదితరులు సైతం నటించారు.
ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కువగా దర్శకులు రాజ్ & డీకే కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ ఇండియా వైడ్ గా భారీ పాపులారిటీ సంపాదించుకున్నది. గతంలో వీరిద్దరి కలయికలు వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ మంచి విజయాన్ని అందుకుంది ఈ సీజన్ నుంచి రెండు సీజన్లు రాగా సెకండ్ సీజన్ లో సమంత నటించిన సౌత్ లో ఈ సిరీస్ కి మంచి ఆదరణ లభించింది.. దాంతో రాజ్ & డీకే కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న ఈ సిరీస్ పై సౌత్ లో కూడా భారీగా ఇంపాక్ట్ పెరిగిపోతుంది
ఈ నేపథ్యంలోని ఫిబ్రవరిలో దొంగ నోట్ల ప్రింట్ చేసే ఒక కథ అంశంతో వచ్చిన వెబ్ సిరీస్ ఫర్జీ. ఈ వెబ్ సిరీస్ ను కూడా రాజ్ & డీకే తెరకెక్కించడం జరిగింది ఈ సిరీస్లో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ సౌత్ స్టార్ విజయ్ సేతుపతి.. రాశి ఖన్నా ప్రధాన పాత్రలో నటించారు. మొత్తం 8 ఎపిసోడ్లలో వచ్చిన ఈ సీజన్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో విజయ్ సేతుపతి, రాశి ఖన్నా ఉండడంతో సౌత్ లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ సిరీస్ దీంతో ఇండియాలో ఈ సిరీస్ ఎక్కువగా చూసిన సిరీస్ గా మొదటి స్థానంలో నిలిచింది. ఫర్జి వెబ్ సిరీస్ ఇంతగా పాపులర్ అవ్వడానికి కారణం వీరిద్దరే అని చెప్పవచ్చు... అందులో రాజ్ & డీకే.. విజయ్, రాశి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: