కాంతార 2 రిషబ్ రచ్చ రంబోలా..!

shami
కాంతార సినిమాతో నేషనల్ లెవల్ లో సూపర్ పాపులర్ అయ్యాడు కన్నడ నటుడు డైరెక్టర్ రిషబ్ శెట్టి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషనల్ హిట్ అయిన ఈ సినిమా ప్రేక్షకులందరిని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లింది. కాంతార సూపర్ హిట్ అవడంతో కాంతార 2 మీద గురి పెట్టారు మేకర్స్. ఇక ఈ సీక్వెల్ కి రిషబ్ రెమ్యునరేషన్ తెలిసి అందరు షాక్ అవుతున్నారు. సినిమాలో హీరో, డైరెక్టర్ రెండు రోల్స్ పోశిస్తున్న రిషబ్ కాంతార 1 కి 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోగా.. కాంతార 2కి అది 20 రెంట్లు అధికమవుతుందని తెలుస్తుంది.
అదెలా అంటే కాంతార 2 సినిమా కోసం రిషబ్ శెట్టి 100 కోట్ల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడని కన్నడ మీడియా టాక్. అంటే మొదట 50 కోట్లు డైరెక్ట్ రెమ్యునరేషన్ లాగా తీసుకుని మిగతాది బిజినెస్ లో షేర్ అందుకుంటాడని టాక్. అలా మొదటి పార్ట్ కి ఐదు కోట్లు తీసుకున్న రిషబ్ శెట్టి సెకండ్ పార్ట్ కి మాత్రం 100 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకున్నాడు. సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న వారిలో అతి తక్కువమంది 100 కోట్లు మార్క్ టచ్ చేస్తున్నారు.
వీరిలో ఇప్పుడు రిషబ్ శెట్టి కూడా చేరాడు. అయితే కేవలం హీరోగానే కాదు డైరెక్టర్ గా కూడా చేస్తున్నాడు కాబట్టి ఈ రెమ్యునరేషన్ అతనికి ఇవ్వడంలో తప్పేమి లేదని అంటున్నారు ఆడియన్స్. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతార వరల్డ్ వైడ్ గా 400 కోట్ల దాకా వసూలు చేసింది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ కి 200 కోట్ల దాకా బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సీక్వెల్ తో రిషబ్ తన సత్తా ఏంటన్నది మరోసారి చూపించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: