మెగాస్టార్ ఆ మూవీతో రిస్క్ చేస్తున్నాడా..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. మెగాస్టార్ చిరంజీవి కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉండి రాజకీయాలపై దృష్టి పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 మూవీతో చిరంజీవి సినిమా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.  ఖైదీ నెంబర్ 150 మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను అందుకొని తన స్టామినాన్ని మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర నిరూపించుకున్నాడు.

ఆ తర్వాత ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించిన చిరంజీవి తాజాగా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన వాల్తేరు వీరయ్య మూవీతో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి "భోళా శంకర్" అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ తమిళ సూపర్ హిట్ మూవీ వేదాలం కు అధికారికంగా రూపొందుతుంది. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తూ ఉండగా , మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేష్ ఈ మూవీలో చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటిస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఆగస్టు 11వ తేదీన థియేటర్లో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇంతకు ముందే ఈ తేదీన మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ని విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. అలాగే రజనీ కాంత్ హీరోగా రూపొందుతున్న జైలర్ మూవీ ని ... సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న యనిమల్ మూవీ ని కూడా ఇదే తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ లు ప్రకటించాయి. ఇలా భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమాలతో పాటు చిరంజీవి సినిమా విడుదల చేస్తున్నట్టు ప్రకటించడంతో చిరంజీవి "భోళా శంకర్" మూవీ విడుదల తేదీ విషయంలో రిస్కు చేస్తున్నడు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: