అది తాగి షాక్ ఇచ్చిన కీర్తి సురేష్?

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ హీరో న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్‌ కలిసి నటించిన సినిమా దసరా.ఈ సినిమా మార్చి 30న రాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీని దేశ వ్యాప్తంగా పాన్ ఇండియా రేంజిలో రిలీజ్ చేస్తున్నారు.పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కావడంతో.. సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కూడా ముందు నుంచే మొదలుపెట్టేశారు. అందులో భాగంగా దేశమంతా  నాని, కీర్తి సురేష్‌లు తిరుగుతున్నారు. తాజాగా రానాని కూడా దసరా ప్రమోషన్స్‌కు తీసుకొచ్చాడు నాని. అక్కడ నాని, రానా ఇంకా కీర్తి సురేష్‌లు ఎంతగానో సందడి చేశారు. అక్కడ వీరు పోటీ పడి మరీ కల్లు తాగేశారు. కీర్తి సురేష్ అయితే నాన్ స్టాప్‌గా గుట్టగుట్ట తాగేసి అక్కడ అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది.ఇక దసరా సినిమా కోసం నాని, కీర్తి సురేష్‌లు కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నారు. ఈ సినిమాను ఎలాగైనా బాగా ప్రమోట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. 


అందుకే గత రెండు మూడు వారాల నుంచి సినిమాని చాలా గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. సినిమా మీద ఇప్పటికే అంచనాలు చాలానే పెరిగాయి. పాటలు కూడా ఆల్రెడీ క్లిక్ అయ్యాయి.సినిమా టీజర్, ట్రైలర్ అన్నీ కూడా బాగానే హైప్ క్రియేట్ చేశాయి. వాటికి తగ్గట్టుగా నాని ఇంకా కీర్తి సురేష్‌లు మీడియాతో బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు.నాని అయితే మొదటి సారిగా ట్విట్టర్‌లో చిట్ చాట్ కూడా చేశాడు. నెటిజన్లు అడిగిన అన్ని ప్రశ్నలకు నాని సమాధానం ఇచ్చాడు.ఇంకా కీర్తి సురేష్ కూడా తన స్టైల్లో ప్రమోషన్స్ చేస్తోంది. కీర్తి సురేష్‌, నాని కలిసి చేసిన రీల్ వీడియో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. చమ్కీల అంగీలేసి అంటూ కీర్తి సురేష్‌, నాని కలిసి వేసిన స్టెప్పలు ఇంకా దానికి సంబంధించిన రీల్ వీడియో నెట్టింట బాగానే వైరల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: