బాలీవుడ్ ని వణికిస్తున్న రాజమౌళి?

Purushottham Vinay
ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ సత్తా చాటుతున్న రోజుల్లో మగధీర, ఈగ లాంటి విజువల్‌ వండర్స్‌ను రూపొందించి బాలీవుడ్ మేకర్స్‌ కూడా సౌత్ వైపు చూసేలా చేశాడు. ఈ సక్సెస్‌లతో నార్త్ మేకర్స్ ఎలర్ట్ అయినా కానీ జక్కన్న మాత్రం బాలీవుడ్‌ రేంజ్‌ను కూడా దాటిపోతారని అసలు వారెవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ ఆ కాన్ఫిడెన్స్ అనేది బ్రేక్ అవ్వడానికి పెద్ద టైమేం పట్టలేదు.బాహుబలి సినిమాతో సౌత్ కి అసలైన పాన్ ఇండియా మార్కెట్‌కు గేట్స్ ఓపెన్ చేసిన రాజమౌళి తరువాత చాలా ఈజీగా నార్త్ మార్కెట్‌ను కూడా కాంకర్‌ చేశారు. ఆ తరువాత రాజమౌళి బాటలో సౌత్‌లోనూ తమ సత్తా చాటాలని చాలా మంది బాలీవుడ్ మేకర్స్ ట్రై చేసినా కూడా ఇంత వరకు సక్సెస్ అయిన దాఖలాలైతే లేవు.బ్రహ్మాస్త్ర లాంటి సినిమాలు సౌత్‌లో సక్సెస్ అయినా… భారీ ఫాలోయింగ్ మాత్రం రాలేదు. బాహుబలి 2 సినిమా కేవలం వసూళ్ల పరంగానే కాదు రికార్డుల పరంగా కూడా బాలీవుడ్ ముందు చాలా చాలెంజెస్‌ను ఉంచింది.


ఇండియన్‌ మూవీ ఇండస్ట్రీ అంతకు ముందు ఎన్నడూ కనీవినీ ఎరుగని రేంజ్‌లో వెయ్యి కోట్ల మార్క్‌ను ఈజీగా రీచ్‌ అవ్వటమే కాదు బాలీవుడ్‌లో కూడా హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచి నార్త్ మేకర్స్ ముందు బిగ్ టార్గెట్‌ను ఉంచింది. ఈ టైమ్‌లో పఠాన్ సినిమా నార్త్ ఇండస్ట్రీ మీద ఆశలు కల్పించింది.రీసెంట్‌గా పఠాన్ సినిమాతో బాహుబలి 2 రికార్డ్‌ను బ్రేక్ చేసిన నార్త్ మేకర్స్‌కు కాస్త ఊపిరి పీల్చుకునే లోపే మరో పెద్ద షాక్ తగిలింది. తాజాగా ఆస్కార్ వేదిక మీద సత్తా చాటి మరోసారి బాలీవుడ్‌ ని డైలమాలో పడేశారు జక్కన్న రాజమౌళి.వందేళ్ల ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఆస్కార్ సాధించిన తొలి మూవీగా ఆర్ ఆర్ ఆర్ సినిమా చరిత్ర సృష్టించింది. నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావటంతో ఇప్పుడు ఈ టార్గెట్‌ను ఎచ్చీవ్ చేసేందుకు చాలా స్ట్రాటజీలు రెడీ చేసుకుంటున్నారు బాలీవుడ్ సినీ జనాలు.ఎన్ని రెడీ చేసుకున్న రాజమౌళి చాలా ఈజీగా దాటేస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: