అరుదైన రికార్డ్ సృష్టించిన మహేష్?

Purushottham Vinay
టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో తన 28 వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ కంపెనీల్లో ఒకటైన హారిక హాసిని బ్యానర్ లో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్దే శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికే కంపోజింగ్ పూర్తయినట్టు సమాచారం తెలుస్తుంది. రీసెంట్ గా సినిమా మరో షెడ్యూల్ స్టార్ట్ చేయగా సెట్స్ లో మహేష్ త్రివిక్రం మరో సీనియర్ నటుడు జయరాం తో కలిసి దిగిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది.ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. అల వైకుంఠపురములో సినిమాలో తమిళ నటుడు జయరాం నటించారు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ సినిమాలో కూడా ఆయన ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది. క్యాజువల్ గా ముగ్గురు కలిసి దిగిన ఈ ఫోటో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ గా మారింది. సినిమాలో వీరిద్దరి మధ్య ర్యాపో కూడా చాలా బాగా కుదిరిందని సమాచారం తెలుస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో స్క్రీన్ షేర్ చేయడం గురించి తన సంతోషాన్ని వెల్లడించారు జయరాం.సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయన తనయుడితో సినిమాలు చేస్తున్నానని నటుడు జయరాం తన ఇన్ స్టాగ్రామ్ లో రాసుకొచ్చారు. మన మహేష్ బాబుతో ఒకసారి కలిసి నటిస్తే ఎవ్వరైనా మళ్లీ మళ్లీ ఆయనతో కలిసి నటించాలని అనుకుంటారు. ఇక త్రివిక్రమ్ మహేష్ కాంబో విషయానికి వస్తే ఆల్రెడీ అతడు, ఖలేజా లాంటి క్లాసిక్ సినిమాలు చేశారు కాబట్టి ఈ కాంబోపై కూడా ఎన్నో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.సర్కారు వారి పాట లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అయ్యి అనేక రికార్డులు బద్దలు కొడుతుందని మహేష్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 11 వ తేదీన విడుదల చెయ్యనున్నారు. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి రికార్డులని నమోదు చెయ్యనుందో..

తాజాగా మహేష్ అరుదైన రికార్డుని క్రియేట్ చేశాడు. ఇంస్టాగ్రామ్ లో 10 మిలియన్స్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న మహేష్.. అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో 10 మిలియన్స్ కంటే ఎక్కువ ఫాలోవర్స్ కలిగిన సౌత్ ఇండియా హీరోగా అరుదైన రికార్డు సృష్టించాడు.ఈ రికార్డ్ కేవలం మహేష్ కి మాత్రమే సొంతం అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: