ధనుష్ కెరియర్ లోనే ఆ విషయంలో హైయెస్ట్ గా నిలిచిన "వాతి" మూవీ..!

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ధనుష్ ఒకరు. ఇప్పటికే ధనుష్ ఎన్నో కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ లలో హీరో గా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ఫుల్ క్రేజీ హీరో టాలీవుడ్ యువ దర్శకుడు అయినటు వంటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన వాతి అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ తెలుగు లో కూడా విడుదల అయింది.
 

తెలుగు లో ఈ మూవీ సార్ అనే పేరుతో విడుదల అయింది. ఈ మూవీ లో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించగా ... జీ వి ప్రకాష్ కుమార్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీcని నిర్మించాడు. ఈ మూవీ విడుదలకు ముందే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు మరియు పాటలను ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై తమిళ మరియు తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు పెరిగిపోయాయి. అలా మంచి అంచనాలు నడుమ తమిళ్ మరియు తెలుగు లో ఒకే సారి విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాప్ ను తెచ్చుకొని అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను రాబట్టింది.

ఇప్పటికి కూడా ఈ మూవీ కి సూపర్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను విడుదల చేసింది. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 118 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసినట్లు ... ఈ కలెక్షన్ లు ధనుష్ కెరియర్ లోనే హైయెస్ట్ బెస్ట్ కలెక్షన్ లుగా ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇలా ధనుష్ "వాతి" మూవీ తో కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ లను అందుకున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: