సెన్సార్ యూనిట్ కు తెగ నచ్చేసిన నాని సినిమా...!!

murali krishna
నాని మరియు కీర్తి సురేష్ జంటగా డి గ్లామర్ పాత్రలలో నటించిన మాస్ యాక్షన్ సినిమా దసరా. ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి నాని సిద్ధమయ్యారు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో పాన్ ఇండియా రేంజ్ లో మార్చి 30 వ తేదీ విడుదలకు సిద్ధమవుతుందని తెలుస్తుంది.. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాని వరుస ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల ట్రైలర్ విడుదలై దుమ్ములేపుతోందటా.. కొన్ని గంటల్లోనే 20 మిలియన్ వ్యూస్ను రాబట్టి అదరగొట్టింది.. ఈ ట్రైలర్ కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా మంచి ఆదరణ సంపాదించుకొని సినిమాపై భారీ అంచనాలను అయితే పెంచేశాయి. ఇలా ఈ సినిమా ఇతర భాషలలో కూడా భారీ అంచనాలను అయితే ఏర్పరచుకుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి అయినట్టు సమాచారం.చిన్న చిన్న కట్స్తో ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికేట్ ఇచ్చారని తెలుస్తుంది.సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికేట్ తో పాటు సినిమా రన్ టైం ని కూడా లాక్ చేశారు. ఈ సినిమా 2 గం. 36 ని. ల నిడివి ఉండనుందని తెలుస్తుంది.ఇక ఈసినిమా చూసిన సెన్సార్ సభ్యులు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది.ఇక ఈ సినిమాలో నాని ధరణి పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం.. ఇక ఈ సినిమాకు సంబంధించి నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా రికార్డు ధరకు అమ్ముడు పోయాయని సమాచారం.దసరా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మేకర్స్ రూ.45 కోట్లు రాబట్టారని తెలుస్తుంది.నాని సినిమాల్లోఈ సినిమా హైయెస్ట్ బిజినెస్ జరుపుకున్న సినిమా అని సమాచారం.ఇక ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి ఎంతో అద్భుతంగా నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: