' కమల్ హాసన్' ఆస్కార్ కోసం ఎదురుచూసిన సినిమాలు....!!

murali krishna
మన భారతదేశంలో ఏ సినీ పరిశ్రమలోనైనా చాలా మంది నటీనటులు తాము నటించిన సినిమాలకు ఏదో ఒక రకమైన గుర్తింపుతో పాటు కలెక్షన్స్,అవార్డులు రావాలని ఖచ్చితంగా కోరుకుంటారు. ఇక చాలామంది భారతదేశ నటులకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారాలు అయినా పద్మ అవార్డుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రితో,మంత్రులతో, గవర్నర్ లతో, పైరవీలు కూడా చేస్తూ ఉంటారు. అంతా చేసిన కూడా అందులో ఎంత మందికి అవార్డు లభిస్తుంది చెప్పండి. టాలెంట్ తో పాటు ఇలా కాస్త వెనకాల కథ నడిపించే వారికే అవార్డులు లభిస్తున్న రోజులు మరి. అయినా కూడా ఎవరైనా పిలిచి అవార్డు ఇస్తాను అంటే వద్దంటారా చెప్పండి. కానీ అలా వద్దు అని చెప్పి తనను ఎలాంటి అవార్డు పరిశీలన కూడా తీసుకోవద్దు అని చెప్పి ఫిలింఫేర్ లాంటి ఒక సంస్థకి లేఖ రాసిన నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కమల్ హాసన్ మాత్రమే.
కమల్ హాసన్ కి అవార్డులు ఎన్ని వచ్చాయో కూడా లెక్క పెట్టుకోవడానికి సమయం ఉండదు. 60 ఏళ్ల పాటు నటిస్తూనే ఉన్నాడు. చిన్నతనం నుంచి నేటి వరకు తాను ఎన్నో రకాలైన సినిమాలు చేస్తూ వచ్చాడు. అయితే తనకు ఆస్కార్ లభించాలని కోరిక ఎప్పటి నుంచో ఉంది. అందుకోసం అలుపెరగని పోరాటమే చేశాడు. ఏకంగా ఏడు సార్లు ఆస్కార్ అవార్డ్ గడప తొక్క పోయి బంగపడి తిరిగి వచ్చాడు. సాగర్ హిందీ, క్షత్రియ పుత్రుడు, ద్రోహి, భారతీయుడు, నాయకుడు, హే రామ్, స్వాతిముత్యం వంటి ఏడు సినిమాలకు ఆస్కార్ అవార్డు లభిస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూశాడు కమలహాసన్. ఇక ఆస్కార్ సంగతి పక్కన పెడితే ఫిలిం ఫెయిర్ కి తాను ఏ క్యాటగిరి లో కూడా పరిశీలనకు తీసుకోవద్దు అంటూ లేఖ రాయడం వెనక కారణం ఏమై ఉంటుందా అని చాలామంది ఆలోచించారు. వాస్తవానికి కమల్ హాసన్ వ్యక్తిత్వం చాలా భిన్నంగా ఉంటుంది. తనను ఎవరు గుర్తించాల్సిన పనిలేదు అని కమల్ హాసన్ అనుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: