పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్
కళ్యాణ్ ఇప్పటికే తెలుగు నాట ఎన్నో
బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోగా నటించి
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం పవన్ "భీమ్లా నాయక్"
మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే పాన్
ఇండియా మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.
నిధి అగర్వాల్
హీరోయిన్ గా నటిస్తున్న ఈ
మూవీ కి ఎం ఎం
కీరవాణి సంగీతం అందిస్తూ ఉండగా క్రిష్ జాగర్లమూడి ఈ
మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ
మూవీ షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో పవన్
కళ్యాణ్ ...
హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి బ్యానర్ లో రూపొందబోయే ఉస్తాద్ భగత్ సింగ్ అనే
మూవీ లో హీరోగా నటించబోతున్నాడు. ఈ
మూవీ లో పవన్
కళ్యాణ్ సరసన
శ్రీ లీల
హీరోయిన్ గా కనిపించనుండగా దేవి
శ్రీ ప్రసాద్ ఈ
మూవీ కి సంగీతం అందించనున్నాడు.
ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లోనే ఈ
మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. దానితో ప్రస్తుతం ఈ
మూవీ షూటింగ్ కోసం ఈ చిత్ర బృందం భారీ సెట్ ను ఏర్పాటు చేస్తోంది. ఈ విషయాన్ని ఈ
మూవీ నిర్మాణ సంస్థ మైత్రి సోషల్
మీడియా ద్వారా తెలియజేసింది. ప్రస్తుతం ఆర్ట్
డైరెక్టర్ ఆనంద్ సాయి ఈ
మూవీ కోసం ఒక భారీ సెట్ ను ఏర్పాటు చేస్తున్నాడు. ఇది ఇలా ఉంటే పవన్
కళ్యాణ్ ...
హరీష్ శంకర్ కాంబినేషన్ లో
గబ్బర్ సింగ్ మూవీ తర్వాత రూపొందుతున్న
సినిమా కావడంతో ఈ
మూవీ పై పవన్
కళ్యాణ్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.