నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల అనే ఒక కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో దసరా సినిమా చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. 1 ఈ సినిమాలో నాచురల్ స్టార్ నాని కి జోడిగా కీర్తి సురేష్ నటించింది. ఈ సినిమా ఈ నెల 30వ తేదీన విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా అనంతరం నాని శౌర్య దర్శకత్వంలో తన 30వ సినిమా అని చేయబోతున్నాడు. ఈ సినిమా అనంతరం నాని వివేకాత్రియ దర్శకత్వంలో మరో సినిమా కూడా చేయబోతున్నాడని తెలుస్తోంది .ఈ సినిమాలే కాకుండా శైలేష్ కోలను దర్శకత్వంలో హిట్ సిరీస్ కి సీక్వెల్ గా కూడా త్వరలోనే మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.హిట్ 3 సినిమాల్లో కూడా నటిస్తున్నాడు నాని.
అయితే తాజాగా ఇప్పుడు మరొక డైరెక్టర్ తో కూడా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నని. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నటుడు గా మరియు డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాని ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నాని మరియు శ్రీనివాస్ అవసరాల ఇద్దరూ కలిసి గతంలో అష్ట చమ్మ అనే సినిమాలో నటించి సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమా నుండి వీరిద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగుతుంది. గతంలో శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన జ్యో అచ్చుతనంద సినిమాలో కూడా నాని ఒక కామియో పాత్రలో కనిపించడం మనం చూశాం .
అయితే తాజాగా ఇప్పుడు శ్రీనివాస్ అవసరాలు చెప్పినా కద బావుండడంతో నాని ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. దసరా సినిమా అయిపోయిన వెంటనే నాని చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి. ఈ సినిమాలన్నీ కూడా పూర్తయిన తర్వాత నాని శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో సినిమా తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది .ఇక ఈ వార్త తెలిసిన అనంతరం నాని అభిమానులు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు..!!