జబర్దస్త్ లో ఒక్కో ఎపిసోడ్ కి ఇంద్రజ తీసుకునే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

Anilkumar
ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సీనియర్ నటి ఇంద్రజ ఇప్పుడు బుల్లితెరపై క్వీన్ అయిపోయింది. సినిమాలో హీరోయిన్గా తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈమె కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ఆ తర్వాత చాలా కాలానికి ఇప్పుడు బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక రీఎంట్రీ తర్వాత ఇంద్రజ ఒకవైపు బుల్లితెరపై మరోవైపు వెండితెరపై వరుస అవకాశాలతో బిజీబిజీగా గడుపుతూ ఉంది. ఇక బుల్లితెర కామెడీ షో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోల్లో ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదట్లో ఈ షో కి రోజా, నాగబాబు జడ్జిలుగా చేశారు. 

అయితే వ్యక్తిగత కారణాలవల్ల ఈ షో నుండి వాళ్ళు తప్పుకున్నారు. వాళ్ళిద్దరి తర్వాత చాలామంది ఈ షోకు జడ్జిగా చేశారు. అదే సమయంలో సినీనటి ఇంద్రజ బుల్లితెరపై అడుగు పెట్టింది. మొదటగా శ్రీదేవి డ్రామా కంపెనీతో జడ్జిగా ఆకట్టుకున్న ఆమెని జబర్దస్త్ తీసుకురాగా.. ప్రస్తుతం రోజా స్థానంలో ఆమె జడ్జిగా కంటిన్యూ అవుతుంది. అలాగే నాగబాబు ప్లేస్ ని కృష్ణ భగవాన్ జడ్జ్ గా అలరిస్తున్నాడు. ఇదిలా ఉంటే జబర్దస్త్ లో ఇంద్రజకి ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్ వస్తుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం జబర్దస్త్ జడ్జిగా కొనసాగుతున్న ఇంద్రజకి ఒక్కో ఎపిసోడ్ కు 2.5 లక్షలు ఇస్తున్నారట.

అటు కమెడియన్ కృష్ణ భగవాన్ కి కూడా ఒక్కో ఎపిసోడ్ కు 2.5 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అంతకుముందు చేసిన రోజా కి మాత్రం ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా 5 లక్షలు ఇచ్చినట్లు సమాచారం. నాగబాబు కూడా 3 లక్షల రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇచ్చారట. అయితే వాళ్లతో పోలిస్తే ప్రస్తుతం ఇంద్రజ, కృష్ణ భగవాన్ లకు కాస్త తక్కువగానే రెమ్యూనరేషన్ ఇస్తున్నారని చెప్పాలి. మరోవైపు ఇంద్రజ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తే సినిమా మొత్తం మీద ఆమెకు జబర్దస్త్ తో పోలిస్తే తక్కువ రెమ్యూనరేషన్ వస్తుందట. అందుకే ఇంద్రజ సినిమాల్లో కంటే బుల్లితెరపై జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు చెబుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: