సినీ నటుడు, నందమూరి హీరో తారకరత్న పెద్దకర్మ కార్యక్రమం గురువారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు చాలామంది హాజరయ్యారు. ఈ క్రమంలోనే వీరసింహారెడ్డి డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా తారకరత్న పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇక ఇదే కార్యక్రమంలో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సైతం కనిపించాడు. అయితే తాజాగా తారకరత్నపెద్దకర్మ కు సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో బాలయ్య ఎన్టీఆర్ను పట్టించుకోలేదని.. ఎన్టీఆర్ ని బాలయ్య దూరం పెడుతున్నారంటూ అభిమానుల సైతం ఎమోషనల్ అవ్వడం జరిగింది.
ఇక తాజాగా సోషల్ మీడియాలో మరో వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఫోన్ నెంబర్ను డైరెక్టర్ గోపీచంద్ మలినేని అడిగిమరీ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. మోక్షజ్ఞ కూడా గోపీచంద్ మలినేని నంబర్ను తీసుకున్నాడు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసి అభిమానులైతే ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ ఇద్దరు ఇలా నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారంటే కచ్చితంగా వీరి కాంబోలో సినిమా సెట్ అయ్యేలా ఉందంటూ అభిమానులు తెగ ఆనంద పడిపోతున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. ఆదిత్య 369 సీక్వెల్ గా రాబోతున్న ఆదిత్య 999 మ్యాక్స్ అనే సినిమా కథను బాలయ్య డైరెక్ట్ చేస్తుండగా..
ఆ మూవీతో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని వార్తలు వచ్చాయి. ఇప్పటివరకు దానిపై ఎటువంటి క్లారిటీ లేదు. ఆ తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను, పూరి జగన్నాథ్, అనిల్ రావిపూడిల పేర్లు కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు మాత్రం గోపీచంద్ మలినేని మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. మరి ఇది కనక వర్కౌట్ అయితే నందమూరి అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. ఇక వీరసింహారెడ్డి తర్వాత గోపీచంద్ మలినేని ఇప్పటివరకు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. ఆ మధ్య ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఓ స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఎన్టీఆర్ కి కూడా ఆ స్క్రిప్ట్ వినిపించగా.. ఎన్టీఆర్ ఆస్క్రిప్ట్ పై పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేదు. మరి గోపీచంద్ మలినేని తన నెక్స్ట్ మూవీ మోక్షజ్ఞతో చేస్తాడా? లేక మరో హీరోని లైన్లో పెడతాడా అనేది చూడాలి...!!