HCA Awards 2023: తారక్ కు రెండు హెచ్సీఏ అవార్డ్స్.. అలియా కి కూడా..!

Divya
HCA Awards 2023: హెచ్ సి ఏ అవార్డులలో జూనియర్ ఎన్టీఆర్ కి అవార్డు రాకపోవడం పై ఆయన అభిమానులు పూర్తిస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలోనే తారక్ కి కూడా అవార్డులు ఉన్నాయి అని , హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ ప్రకటించింది.. తారక్ కు సినిమా షూటింగ్ బిజీ వల్ల అమెరికాకు రాలేకపోయినట్టు తమకు తెలిపారని.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్కి వచ్చిన అవార్డుల ట్రోఫీలను అధికారిక ట్విట్టర్ ఖాతాలో కూడా షేర్ చేసింది.
ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను తారక్ కు స్పాట్ లైట్ అవార్డు అలాగే బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డులు తారక్ కు వచ్చినట్లు హెచ్సీఏ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. అటు రామ్ చరణ్ కి కూడా హెచ్ సి ఎస్ స్పాట్లైట్ అవార్డును అందించిన విషయం తెలిసిందే.. ఇప్పుడు ఆలియా భట్ కి కూడా స్పాట్లైట్ అవార్డును హెచ్సీఏ ప్రకటించింది. డియర్ ఆర్ ఆర్ ఆర్ సపోర్టర్స్ అండ్ ఫాన్స్ జూనియర్ ఎన్టీఆర్,  అలియా భట్లకు వచ్చిన అవార్డులను మీతో పంచుకుంటున్నాము.. వచ్చేవారం ఈ అవార్డులను వారికి నేరుగా ఇక్కడ నుంచే పంపిస్తాము అంటూ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ట్రీట్ చేయడం ఇప్పుడు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది.

ఇకపోతే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ చిత్రం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సినిమా మోత మోగిస్తోంది అంటే ఏ రేంజ్ లో సినిమా ప్రేక్షకులను అలరించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు అందివ్వడంతో ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు అలియా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కేవలం స్పాట్లైట్ అవార్డు రామ్ చరణ్ కు మాత్రమే ఇచ్చాయని తారక్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్న సమయంలో హెచ్సీఏ ఇలాంటి ప్రకటన చేసి అందర్నీ సంతోషానికి గురి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: