రూ.86 లక్షల మోసం కేసులో షారుక్ భార్య..!!

Divya
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ భార్య పైన తాజాగా చీటింగ్ కేసు నమోదు అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఒక ఫ్లాట్ విక్రమానికి సంబంధించి తనను మోసం చేశారని ముంబైకి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన తులసియాని కంపెనీ ఒక వ్యక్తికి ఫ్లాట్ అమ్మిందట. సకాలంలో ఫ్లాటును తనకు ఇవ్వకుండా వేరే వారికి విక్రయించారని బాధితుడు పోలీసులకు ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది.

షారుక్ ఖాన్ భార్య గౌరీఖాన్ ప్రమోట్ చేయడం వల్ల తాను ఈ ప్లాట్ ను కొనుగోలు చేశానని తెలియజేశారు ఇప్పుడు కంపెనీ వారు మోసం చేశారని బాధితుడు వారి పైన కేసు నమోదు చేయడం జరిగింది. బాధితుడు ఫిబ్రవరి 25వ తేదీన ఈ కేసును నమోదు చేసినట్లుగా సమాచారం. అయితే ఇప్పటివరకు ఈ విషయం బయటికి రాలేదు. బాధితుడు  జస్వంత్ సాహూ మహారాష్ట్రలోని ముంబైలో అంతేరి ఈస్ట్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అతను చెప్పిన వివరాల ప్రకారం 2015 వ సంవత్సరంలో గౌరీ ఖాన్ లక్నోకు చెందిన తులసియాని కంపెనీ ప్రమోట్ చేయడం జరిగిందట.
లక్నౌలోని షాహిద్ పాతులో తులసియాని కంపెనీ ఒక టౌన్ షిప్టును అభివృద్ధి చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ విషయాన్ని గౌర ఖాన్ ప్రకటనను చూసి తర్వాత జస్వంత్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ ను తులసియానిని సంప్రదించినట్లు తెలియజేశారు. వీరిద్దరూ రూ.86 లక్షలకు ఫ్లాట్ను అమ్మడానికి డీల్ ఫిక్స్ చేసినట్లు తెలియజేయడం జరిగింది. ఈ ఫ్లాట్ ను బ్యాంకు నుంచి అప్పుగా తీసుకువచ్చి కట్టానని బాధితుడు తెలిపారు. 2016లో అక్టోబర్లో ఫ్లాట్ ను రిజిస్ట్రేషన్ చేసి అప్పగిస్తామని కంపెనీ హామీ కూడా ఇచ్చిందని తెలిపారు. అయితే ఆ తర్వాత ఫ్లాట్ ను అప్పగించకపోవడంతో కంపెనీ నష్టపరిహారం కింద రూ.22.70 లక్షల రూపాయలు చెల్లించి ఆరు నెలలలోనే ఫ్లాట్ ను అప్పగిస్తామని తెలియజేసిందట.ఇది విఫలమైతే ఇచ్చిన డబ్బులకు వడ్డీతో పాటు మొత్తం తిరిగి ఇస్తామని కంపెనీ తెలిపిందట. కానీ ఆ ఫ్లాట్ ను వేరొక పేరు మీదకి అగ్రిమెంట్ కుదురుచున్నట్లు బాధితుడు తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: