మోడలింగ్ నుండి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది. దక్షిణాదితోపాటు బాలీవుడ్లో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది పూజ హెగ్డే. ఆమె డేట్స్ కోసం చిన్న హీరోలే కాకుండా స్టార్ హీరోలు సైతం ఎదురుచూస్తూ ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగుతోపాటు ప్రస్తుతం పూజా హెగ్డే అన్ని భాషల్లో నీ సినిమాల్లో కూడా నటించే అవకాశాలను దక్కించుకుంటుంది .ఇదిలా ఉంటే ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కోలీవుడ్ నుండి కూడా ఆమెకు ఒక బంపర్ ఆఫర్ వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి .
తమిళ హీరో ఆర్య కి జోడిగా ఒక సినిమాలో నటించే అవకాశాన్ని పూజా హెగ్డే దక్కించుకున్నట్లుగా సమాచారం. 2010లో కార్తి హీరోగా నటించిన ఆవారా సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా దర్శకుడు లింగస్వామి ఆవారా సినిమాకి సీక్వెల్ ని చేయాలని నిర్ణయించుకున్నాడు. సాధారణంగా చాలామంది దర్శకులు సీక్వెల్ అంటే మొదటి భాగంలో చేసిన హీరో హీరోయిన్లని సీక్వెల్ లో కూడా హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ సినిమా దర్శకుడు లింగస్వామి మాత్రం ఈ సినిమాలో హీరోగా కార్తీక్ కాకుండా ఆర్యను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే నీ కూడా లింగస్వామి ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే లింగస్వామి పూజ హెగ్డే కి కథను కూడా వినిపించాడట.కద విన్నా అనంతరం పూజా హెగ్డే కి నచ్చి ఈ సినిమా చేసేందుకు ఒప్పుకుందని తెలుస్తోంది. ఇక ఈ వార్త కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగుతోపాటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పూజా హెగ్డే మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో మహేష్ బాబు కి జోడిగా నటిస్తోంది..!!