పుష్ప 2 టీజర్ కోసం భారీ ప్లాన్ చేస్తున్న సుకుమార్.. ఎప్పుడో తెలుసా..!?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే.ఈ క్రమంలోనే పుష్పటు షూటింగ్ కూడా చాలా సైలెంట్ గా మొదలుపెట్టాడు ఈ సినిమా దర్శకుడు సుకుమార్. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ కోసం మాత్రం మే ఏడాది కి పైగానే సమయాన్ని తీసుకున్నాడు. అనంతరం ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుందని తెలుస్తోంది. అంతేకాదు త్వరలోనే హైదరాబాద్ సిటీలో కూడా కొన్ని సీన్స్ తేయాల్సి ఉంది అని అంటున్నారు. 

చాలా జాగ్రత్తగా ఎక్కువ బ్రేకులు లేకుండా ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ లు కూడా ఇవ్వకుండా చాలా సీక్రెట్ గా ఈ సినిమా షూటింగ్ను తీస్తున్నాడు సుకుమార్. అయితే ముందుగా టీజర్ ను అవతార్ టు రిలీజ్ చేసే సమయంలో విడుదల చేయాలని భావించారు. అంతేకాదు దానికోసం ఒక స్పెషల్ టీం కూడా దానిపై పని చేసింది. సుకుమార్ సైతం దానికోసం ఎంతో కష్టపడ్డాడు. కానీ దానికి సంబంధించిన పనులు అనుకున్నంత సులువుగా పూర్తికాలేదు.దీంతో లోలోపలే ఆ విషయాన్ని దాచుకొని సినిమా టీజర్ ను వాయిదా వేశాడు. దాని అనంతరం టీజర్ లోనే కొన్ని డైలాగ్ లు లీక్ అయ్యాయి. దాంతో ఈ సినిమాలోని కొన్ని గ్లిమ్స్ ను వదిలేశారు సుకుమార్ .

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అభిమానులు పుష్ప బిరువులు టీజర్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సుకుమార్ మరియు ఏ సినిమా చిత్ర బృందం కూడా టీజర్ విడుదల చేసే పనిలోనే బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవైపు సినిమాకి సంబంధించిన షూటింగ్ చేస్తూనే మరోవైపు టీజర్ పై కూడా భారీగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ సినిమా స్టైల్ లోనే పుష్ప టీజర్ కూడా ఉంటుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ గురించి ఒక అద్భుతమైన అప్డేట్ కూడా మేకర్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. మరి సుకుమార్ అల్లు అర్జున్ అభిమానులను నిరాశపరచకుండా త్వరలోనే టీజర్ విడుదల చేస్తాడా లేదా అన్నది చూడాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: