చిరంజీవి ఆచార్య మూవీలో భారీ అగ్నిప్రమాదం.. ఆందోళనలో ఫ్యాన్స్..!
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. అంతేకాదు చిరంజీవి, రామ్ చరణ్ కెరియర్ లో కూడా ఇంతకు మించి డిజాస్టర్ లేదని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే 2022 ఏప్రిల్ 29న ఈ సినిమాను రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా కోసం 23 కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. 20 ఎకరాల విస్తీర్ణంలో ధర్మస్థలి పేరుతో టెంపుల్ సెట్ వేశారు.
ఇప్పుడు ఈ సెట్ మొత్తం అగ్నికి ఆహుతి అయిందని తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయభ్రాంతులకు గురి అయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు . అయితే ఈ అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని సంభవించలేదు కానీ రూ.23 కోట్లతో విజువల్ వండర్ గా అనిపించిన సెట్ మొత్తం అగ్నికి ఆహుతి అవడం నిజంగా బాధాకరమని చెప్పాలి.
అయితే అసలు ఆ మంటలు ఎక్కడినుంచి చెలరేగాయి? నిప్పు ఎక్కడినుంచి వచ్చింది? అనేది మాత్రం రహస్యంగానే ఉండిపోయింది. అయితే ఒక వ్యక్తి ఈ సెట్ బయట కూర్చుని సిగరెట్ కాల్చి పారేయడంతో ఇలా బుగ్గి పాలైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సెట్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కోకాపేట్ సరస్సు దగ్గర ఈ టెంపుల్ సెట్ ను భారీ గా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది . అయితే అది ప్రైవేటు స్థలం కావడంతో ఆ సెట్ ను తీయకుండా అలాగే ఉంచేసారట. చాలామంది దీనిని చూడడానికి వచ్చేవారని తెలుస్తోంది అయితే ఇప్పుడు ఇలా అగ్నికి ఆహుతి అవడంతో ప్రతి ఒక్కరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణహాని తప్పింది అని చెప్పవచ్చు.