ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ కి ఫ్యాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు కూడా దక్కింది. అంతే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అభిమానులు సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబట్టింది.పుష్ప రాజ్ పాత్రలో బన్నీ మంచి మార్కులను కొట్టేశాడు. అయితే తాజాగా ఈ సినిమాపై కొన్ని ఆసక్తికరమైన కామెంట్లను చేశాడు బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్.
ఇటీవల రణబీర్ కపూర్ కి ఉత్తమ నటుడిగా ఒక అవార్డు రావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు రణబీర్ కపూర్. ఈ నేపథ్యంలోనే గతేడాది వచ్చిన సినిమాలలో తనకు నచ్చిన సినిమాల గురించి చెప్పుకొచ్చాడు.. అందులో భాగంగానే తనకు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పాత్ర చాలా నచ్చిందని.. అల్లు అర్జున్ పోషించిన పాత్రలో తనకి కూడా నటించాలని ఉంది అంటూ తన మనసులోని కోరికను బయటపెట్టాడు రణబీర్ కపూర్.. అంతేకాకుండా నటన పరంగా గత రెండేళ్లలో నన్ను మూడు చిత్రాలు చాలా ప్రభావితం చేశాయని.. పుష్పా లో అల్లు అర్జున్ గంగుబాయిలో అలియా భట్ పాత్ర త్రిబుల్ ఆర్ లోని పాత్రలు నాపై ఎంతో ప్రభావాన్ని చూపించాయి
అంటూ చెప్పుకొచ్చాడు రన్బీర్ కపూర్.. ఒక నటుడిగా ప్రేక్షకుడిగా ఇలాంటి క్యారెక్టర్ నాకు వచ్చి ఉంటే చాలా బాగుండేది అని నేను చాలాసార్లు అనుకున్నాను అంటూ చెప్పకు వచ్చాడు. వీటితోపాటు గతంలో తాను పాకిస్తానీ సినిమాలలో చేయాలనే ఉంది అన్న మాటలను చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు అంటూ చెప్పుకొచ్చాడు.. దీంతోపాటు నేను వెళ్ళినా చాలా కార్యక్రమాలలో అనేకమంది పాకిస్తానీ నిర్మాతలు దర్శకులు వచ్చారు.. మంచి కథలు ఉంటే పాకిస్తాన్ సినిమాలో నటిస్తారా అని నన్ను అడగడం జరిగింది ..నా ఉద్దేశంలో కలకు ఎలాంటి హద్దులు ఉండవు.. అందుకే అలాంటి సినిమాల్లో కూడా నటిస్తానని నేను చెప్పాను.. కానీ నేను మాట్లాడిన ఆ మాటలు కొందరు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు అంటూ చెప్పుకోచాడు.. ప్రస్తుతం ఈయన సందీప్ వంగా తెరకెక్కిస్తున్న యానిమల్ సినిమాలో నటిస్తున్నారు.. ఇక ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది..!!