SSMB -28 : శ్రీ లీలతో మహేష్ మొదలు పెట్టేది అప్పుడే..!!
ఇప్పటివరకు కొంతమేరకు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు నెలలో ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది. ఇక తాజా కొత్త షెడ్యూల్ ని సోమవారం నుంచి హీరోయిన్ శ్రీ లీల, మహేష్ మధ్య సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీ లీల ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతూ మంచి క్రేజ్ అందుకుంది. దీంతో ఈ అమ్మడు వరుస సినిమా అవకాశాలు కూడా వెలుబడుతూనే ఉన్నాయి. ధమాకా చిత్రంతో కూడా గత ఏడాది మంచి విజయాన్ని అందుకున్న ఈ ముందుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంతోంది.
ఇక మహేష్ బాబు, త్రివిక్రమ్ తో సినిమా అయిపోయిన వెంటనే రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా కూడా పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథను ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు ఒక్క చిత్రానికి దాదాపుగా రూ .80 కోట్ల రూపాయలు రెమ్యూనికేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా దాదాపుగా తన నుంచి సినిమా విడుదల కాగ కొన్ని సంవత్సరాలు అవుతోంది.