కళ్యాణ్ రామ్ కి అన్ని కోట్లు ఇచ్చి సాయం చేసిన ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా..!?

Anilkumar
ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు మరియు తన తమ్ముడు త్రివిక్రమ రావు కోసం నందమూరి తారక రామారావు ఎంత చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో అన్నదమ్ముల అనుబంధం అంటే వీరిద్దరి గురించే అందరూ చెప్పేవారు. నందమూరి తారక రామారావు తన తమ్ముడిని నిర్మాతను చేయడం కోసం కోట్ల రూపాయల డబ్బును ఖర్చు చేశారు. అంతేకాదు కోట్ల రూపాయల ఆస్తులను కూడా తన తమ్ముడికి రాసిచ్చాడు సీనియర్ ఎన్టీఆర్.ఇక తాజాగా ఆయన తర్వాత మూడవ తరం లో ఆ బంధం ఇప్పుడు మళ్లీ కనిపించింది. తాజాగా అలాంటి బంధాన్ని నిరూపించాడు జూనియర్ ఎన్టీఆర్.

హరికృష్ణ కుమారులైన కళ్యాణ్ రామ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ఎంత అన్యోన్యంగా ఉంటారు మనందరికీ తెలుసు. వీరి అన్నదమ్ముల అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఓకే తల్లి బిడ్డల్లాగా ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటారు వీరిద్దరూ. ఇక తండ్రి హరికృష్ణ చనిపోయిన తర్వాత వీరిద్దరి బంధం మరింత గట్టిపడింది. హరికృష్ణ కూడా లేకపోవడంతో తన అన్న కళ్యాణ్ రామ్ సినీ కెరియర్ కు జూనియర్ ఎన్టీఆర్ అన్ని విధాలుగా సాయం చేస్తూ వస్తున్నాడు. ఇక అసలు విషయం ఏంటంటే.. ఒకానొక సమయంలో కళ్యాణ్ రామ్ తీవ్ర అప్పుల్లో మునిగిపోయాడు. ఆయన నిర్మాణంలో చేసిన సినిమాలన్నీ కూడా అప్పట్లో డిజాస్టర్లుగా మిగిలాయి. ముఖ్యంగా కిక్ 2  సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది.

 దీంతో పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రాకపోవడంతో మునిగిపోయాడు కళ్యాణ్ రామ్.ఆ సినిమా తో పాటు   కళ్యాణ్ రామ్ నటించిన ఓం సినిమా కూడా భారీ డిజాస్టర్ గా మిగిలింది.దాంతో మరింత అప్పుల పాలయ్యాడు కళ్యాణ్ రామ్. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక సతమతమవుతున్న కళ్యాణ్ రామ్ కు ఏకంగా 12 కోట్ల రూపాయలను సహాయం చేశాడు జూనియర్ ఎన్టీఆర్. అనంతరం కళ్యాణ్ రామ్ బ్యానర్ లో జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ అనే సినిమా చేసి రెమ్యూనరేషన్  కూడా తీసుకోలేదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆ సినిమా ఎంత పెద్ద  బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఆ సినిమా మంచి హిట్ అవడంతో కళ్యాణ్ రామ్ అప్పుల నుండి బయటపడ్డాడు. ఇకపోతే తాజా ఇప్పుడు ఎన్టీఆర్ తన  30 వ సినిమాతో పాటు ప్రశాంత్ నీ దర్శకత్వంలో చేయబోయే సినిమాలకు కూడా కళ్యాణ్ రామ్ నీ నిర్మాతగా ఉంచి ఇప్పటికీ తన అన్నకు సహాయం చేస్తూనే వస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: