దసరా: సీడెడ్ లో న్యాచురల్ స్టార్ నయా రికార్డ్?

Purushottham Vinay
న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ దసరా రీసెంట్ గా టీజర్తో పిచ్చెక్కించి అంచనాలు పెంచి మరింత దుమ్ములేపింది. ఇక ఇటీవలే విడుదలైన పాటలు  కూడా శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటూ బాగా ఊర్రూతలూగిస్తున్నాయి. వీటికి ప్రేక్షకుల దగ్గర మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇకపోతే ఈ మూవీ మార్చి 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళం కన్నడ మలయాళ ఇంకా హిందీ భాషల్లో పాన్ ఇండియా రేంజిలో చాలా భారీగా ఈ మూవీ విడుదల కానుంది. అయితే ఇప్పటికీ ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగినట్లు కూడా వార్తలు వచ్చాయి.అయితే తాజాగా ఈ సినిమా విడుదలకు ముందే అదిరిపోయే ఓ సూపర్ రికార్డును సాధించిందని సమాచారం తెలిసింది. ఇక రీసెంట్ గా ఈ సినిమా సీడెడ్ ఏరియా ప్రీ రిలీజ్ బిజినెస్ నాని కెరీర్ లోనే చాలా భారీగా రికార్డు స్థాయిలో జరిగినట్లు సమాచారం తెలిసింది.



కేవలం ఆ ఒక్క ఏరియాలోనే ఏకంగా రూ. 6.3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం తెలుస్తోంది. ఇది నాని కెరీర్లో ఇప్పటి దాకా అతని ఏ సినిమాకి కూడా ఈ రేంజ్లో బిజినెస్ జరగలేదనే చెప్పాలి. దీంతో మిగతా ఏరియాల్లో కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దుమ్ము లేపడం ఖాయమనే ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.ఇకపోతే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ను రెండు నెలల ముందుగానే చదలవాడ శ్రీనివాస్ మొత్తం రూ. 24 కోట్లకి సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యాక సినిమాపై మరింత హైప్ రాగానే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు .. ఆయన దగ్గర నుంచి ఏకంగా రూ. 28 కోట్ల భారీ మొత్తం చెల్లించి దక్కించుకున్నారని సమాచారం అందింది.ఈ సినిమా కూడా ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ డూపర్ హిట్ అయ్యి నానిని కూడా పెద్ద పాన్ ఇండియా హీరోగా మార్చడం ఖాయమని సమాచారం తెలుస్తుంది. చూడాలి ఈ సినిమా ఇంకెంత పెద్ద హిట్ అవుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: