త్రివిక్రమ్ పై ఫైర్ అవుతున్న మహేష్ అభిమానులు..!

Divya
వరుస విజయాలతో దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గతంలో సర్కారు వారి పాట సినిమా తర్వాత తన 28వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ విషయంపై అభిమానులు త్రివిక్రమ్ పై ఫైర్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ త్రివిక్రమ్ ప్రవర్తన చూసి మరొకసారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా షూటింగ్ కంప్లీట్ చేయకుండా మరొకవైపు పవన్ కళ్యాణ్ చేస్తున్న వినోదయ సీతం సినిమా షూటింగ్లో భాగం కానున్నాడు..

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ వినోదయ సీతం తెలుగు రీమేక్ అధికారిక లాంచ్ వేడుక ఫిబ్రవరి 14వ తేదీ నుండి జరగబోతుందని సమాచారం . ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు సాయిధరమ్ తేజ్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.  సాయిధరమ్ తేజ సరసన కేతిక శర్మ కూడా నటిస్తోంది.. ఈ సినిమాకు దర్శకుడిగా సముద్రఖని వ్యవహరిస్తున్నారు. ఇకపోతే త్రివిక్రమ్ డైలాగ్స్ తో పాటు స్క్రిప్ట్ వెర్షన్ పూర్తి చేసినట్లు సన్నిహిత వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాను వాయిదా వేసి మరి పవన్ కళ్యాణ్ సినిమా కోసం స్క్రిప్ట్ డైలాగ్స్ రాయడం తో మహేష్ అభిమానులు పూర్తిస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబుతో ఒక షెడ్యూల్ పూర్తి చేసిన విషయం తెలిసిందే కాబట్టి రెండవ షెడ్యూల్ కోసం భారీ సెట్ ఏర్పాట్లు చేస్తున్నారు. మహేష్ బాబు కూడా వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లిన నేపథ్యంలో ఆయన రాగానే సినిమా షూటింగ్ మొదలు పెడతానని సినిమా ఏకధాటిగా కంప్లీట్ చేస్తానని త్రివిక్రమ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.. కానీ అభిమానులు మాత్రం త్రివిక్రమ్ పై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే యావత్తు ప్రపంచం మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో త్రివిక్రమ్ తో సినిమా రోజురోజుకీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఇలా అభిమానులు కోపం తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: