టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన 'పుష్ప' సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ కి ఎంత క్రేజ్ వచ్చిందో రష్మిక మందన్న కి కూడా అదే రేంజ్ లో క్రేజ్ వచ్చింది. ఈ సినిమాతో వీళ్ళిద్దరూ పాన్ ఇండియా ఇమేజ్ ను అందుకున్నారు. ఇక ఈ సినిమాతో రష్మిక మందన నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇక పుష్ప మొదటి భాగంలో శ్రీవల్లిగా రష్మిక కి మంచి స్క్రీన్ స్పేస్ దక్కింది. పుష్ప, శ్రీవల్లి మధ్య లవ్ ట్రాక్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. పుష్ప రిలీజ్ తర్వాత రష్మికను ఆమె పేరుతో కాకుండా శ్రీవల్లి అనే పేరుతోనే పిలవడం మొదలుపెట్టారు అభిమానులు.
అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయింది ఈ కన్నడ బ్యూటీ. అయితే ఇప్పుడు పుష్ప పార్ట్ 2 లో రష్మిక మందన పాత్ర చాలా చిన్నగా ఉంటుందని.. సినిమా మొత్తంలో ఆమె స్క్రీన్ స్పేస్ కూడా తక్కువ అని అంటున్నారు. రెండో భాగంలో ఫహద్ పజిల్ పాత్ర అలాగే మరో విలన్ పాత్రలకు ఎక్కువ స్కోప్ ఉండడం.. వాళ్లతో పాటు మరికొన్ని కొత్త పాత్రల ఎంట్రీ తో రష్మిక పాత్ర ఈ సినిమాలో పరిమితంగా మాత్రమే ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త ఫిలిం సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో వాస్తవం ఎంత ఉందనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఒక రకంగా రష్మికకు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి.
అయితే మరోవైపు పుష్ప పార్ట్2 లో రష్మిక పాత్ర చనిపోతుందని గతంలో వార్తలు వినిపించిన సంగతి. తెలిసిందే కానీ సినిమా నిర్మాతలు మాత్రం ఆ వార్తలను ఖండిస్తూ వచ్చారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త గురించి మూవీ టీం ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. ఇక ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవల వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఓ భారీ షెడ్యూల్ ని మొదలుపెట్టగా.. తాజాగా ఈ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది మూవీ టీం. ఇక త్వరలోనే చిత్ర బృందం బ్యాంకాక్ వెళ్లనుంది. అక్కడి అడవుల్లో బన్నీ పై కొన్ని యాక్షన్ సీన్స్ ని సుకుమార్ ప్లాన్ చేసినట్లు సమాచారంమ్ అంతేకాదు రష్మిక, బన్నీలపై అక్కడో పాట కూడా చిత్రీకరించబోతున్నారట. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాని విడుదల చేయాలని మూవీ టీం ప్లాన్ చేస్తోంది..!!