వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలుసా..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక అలాంటి మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే చాలామంది సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి హీరోలుగా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అలాంటి వారిలో వైష్ణవ తేజ్ కూడా ఒకరు. మెగా ఫ్యామిలీ నుండి వైష్ణవ తేజ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆయన నటించిన మొదటి సినిమా ఉప్పెన. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు వైష్ణవ్ తేజ్. నటించిన మొదటి సినిమాతోనే హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తయిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. 

ఇక కరోనా అనంతరం థియేటర్స్ ప్రారంభం కాగానే ఈ సినిమా నిర్మాతలు ధైర్యం చేసి వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. అంతంత మాత్రాన అనుకొని ఈ సినిమాని రిలీజ్ చేశారు నిర్మాతలు. కానీ ఎవరో ఊహించిన విధంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి వైష్ణవ్ తేజ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఉప్పెన సినిమా తర్వాత రెండు సినిమాల్లో చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్. అయితే ఈ క్రమంలోనే ఉప్పెన సినిమాకు వైష్ణవి తేజ్ 50 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ను తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

దాని అనంతరం కృషి దర్శకత్వంలో వస్తున్న సినిమాకి గాను వైష్ణవ్ తేజ్ 75 లక్షల తీసుకుంటున్నాడట.  వైష్ణవ్ తేజ్ మూడవ సినిమాకి ఒక్కసారిగా తన రెమ్యూనరేషన్ పెంచేసాడు. దాదాపు తన మూడవ సినిమాకి రెండు కోట్ల 50 లక్షల కి పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా మెగా మేనల్లుడు మొదటి సినిమాతోనే హిట్ కొట్టడంతో మెగా అభిమానులు సంబరపడుతున్నారు. ఇక వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా నటించిన జరిగింది.ఈ సినిమాతో కృతి శెట్టి కూడా మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది కృతి శెట్టి. ఈ సినిమా అనంతరం వరుస సినిమాలు చేసే అవకాశాన్ని దక్కించుకుంది ఈమె..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: