టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరు అయినటు వంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే ఈ మూవీ సెట్స్ పై ఉండగానే పవన్ ... హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో నటించడానికి ... అలాగే సుజిత్ దర్శకత్వంలో "ఓ జి" అనే మూవీ లో నటించడానికి ఈ రెండు మూవీ లతో పాటు సముద్ర ఖని దర్శకత్వంలో వినోదయ సీతం అనే మూవీ రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.
ఇది ఇలా ఉంటే సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందబోయే వినోదయ సీతం మూవీ లో పవన్ కళ్యాణ్ తో పాటు మరో కీలకమైన పాత్రలో టాలీవుడ్ యువ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటించబోతున్నాడు. ఈ మూవీ లో సాయి ధరమ్ తేజ్ పాత్ర చాలా హైలైట్ గా ఉండబోతున్నట్లు ... సినిమాకే ఈ పాత్ర హైలెట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ మూవీ యొక్క పూజా కార్యక్రమాలు ఫిబ్రవరి 14 వ తేదీ న జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే వినోదయ సీతం మూవీ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. దానితో ఈ మూవీ ని పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ లు రీమేక్ చేస్తూ ఉండడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ఒరిజినల్ వినొదయ సీతం కు కూడా సముద్ర ఖని దర్శకత్వం వహించాడు.