ఇది ఇలా ఉంటే కెరియర్ ప్రారంభంలో ఎక్కువ శాతం
కామెడీ ప్రాధాన్యత ఉన్న
సినిమా లలో నటించిన
నరేష్ ప్రస్తుతం ఎక్కువ శాతం వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో
నరేష్ వరుసగా నాంది ... ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే
మూవీ లలో నటించి తన అద్భుతమైన నటన తో ప్రేక్షకులను అలరించాడు. ఈ
మూవీ లలో నాంది
మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ
మూవీ కి
విజయ్ కనకమెడల దర్శకత్వం వహించాడు. ఇలా ఇప్పటికే నాంది
మూవీ తో మంచి కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న
నరేష్ ...
విజయ్ కనకమెడల కాంబినేషన్ లో ప్రస్తుతం ఉగ్రం అనే
మూవీ రూపొందుతుంది.
ఇప్పటికే ఈ
మూవీ షూటింగ్ ప్రారంభమై చాలా వరకు ఈ
సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ
మూవీ యొక్క టీజర్ ను మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే
నరేష్ ...
విజయ్ కాంబినేషన్ లో రూపొందిన నాంది
మూవీ మంచి విజయం సాధించడంతో ఉగ్రం
మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నిలకొని ఉన్నాయి. మరి వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన ఈ
మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి .