బాలీవుడ్లో నెక్స్ట్ పెళ్లి వీరిదే.. ఆ గుడ్ న్యూస్ ఎప్పుడంటే..?

Divya
గత ఏడాది నుంచి చాలామంది స్టార్ హీరోయిన్లు బ్యాచిలర్ లైఫ్ వీడి తమకు నచ్చిన వారిని వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే గత ఏడాది ఆలియా భట్ తాను ప్రేమించిన ప్రముఖ హీరో రణబీర్ కపూర్ ను వివాహం చేసుకొని అదే ఏడాది ఒక బిడ్డకు జన్మనిచ్చి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మరొకవైపు రవితేజ హీరోయిన్ షియా గౌతమ్ కూడా తాను ప్రేమించిన అబ్బాయిని వివాహం చేసుకొని సర్ప్రైజ్ ఇచ్చింది.
ఇప్పటివరకు బాలీవుడ్ లో ప్రేమ పక్షుల్లా తిరిగిన కియారా అద్వాని , సిద్ధార్థ మల్హోత్ర ప్రేమలో ఉన్న విషయాన్ని మాత్రం బయట చెప్పలేదు . ఎప్పటికప్పుడు వీరి గురించి వార్తలు వస్తున్నా వీటిపై స్పందించే ప్రయత్నం చేయలేదు.కానీ ఫిబ్రవరి ఏడవ తేదీన రాజస్థాన్ జై సల్మేరులోని సూర్యఘర్ ప్యాలెస్ లో సుమారుగా 10 కోట్ల రూపాయల ఖర్చుతో అంగరంగ వైభవంగా  కుటుంబ సభ్యులు,  సన్నిహితులు,  సెలబ్రిటీల మధ్య వీరి వివాహం జరిగింది.
మొన్నటి వరకు ప్రేమ పక్షుల్లా విహరించిన బాలీవుడ్ జంట కియారా అద్వానీ , సిద్ధార్థ మల్హోత్రా పెళ్లి పేరిట ఒకటయ్యారు . అంతే కాదు పెళ్లి తర్వాత ముంబైలో సెలబ్రిటీలు నివసించే జుహు ప్రాంతంలో సుమారుగా 70 కోట్ల రూపాయల విలువచేసే అత్యంత ఖరీదైన ఇంటిలో వీరు నివసించబోతున్నట్లు సమాచారం.  ఇదిలా ఉండగా బాలీవుడ్లో నెక్స్ట్ మిగిలి ఉన్న జంట ఎవరూ అని ఆరా తీయగా రకుల్ ప్రీతిసింగ్ జాకీభగ్నాని పేర్లు వినిపిస్తున్నాయి.  ఇదివరకే వీరిద్దరూ ప్రేమలో ఉన్నామని కన్ఫామ్ చేసేసారు. ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ బాలీవుడ్లో తన వరుస సినిమాలతో బిజీగా ఉంది.  కాబట్టి ఈ సినిమా షూటింగ్ లన్ని పూర్తయిన వెంటనే నటుడు నిర్మాత అయిన జాకీభగ్నానీ తో ఆమె వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఇప్పుడే రకుల్ ప్రీతిసింగ్,  జాకీ భగ్నాని జంటకు పెళ్లి డేట్ చెప్పాలి అని అభిమానులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: