తన భార్య పై ఆ విధంగా ప్రేమను చాటిన స్టార్ హీరో...!!

murali krishna
తెలుగు ఇండస్ట్రీ లో నందమూరి కుటుంబం నుండి చిత్ర పరిశ్రమలో హీరోలుగా కొనసాగుతున్న వారిలో యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు ఆయన చాలా ప్రయోగాత్మక సినిమాల ద్వారా ఆడియన్స్ ఎదుటకు వస్తుంటారు.ఆయన నటుడిగా నిర్మాతగా పరిశ్రమలో బాగా నేమ్ సంపాదించుకున్న కళ్యాణ్ రామ్ పోయిన ఏడాది  బింబిసారా మూవీ  ద్వారా మంచి విజయాన్ని అందుకున్నారు.
ఐతే ఈ సంవత్సరం ఆయన అమిగోస్ అనే మూవీ  ద్వారా ఆడియన్సెఎదుటకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ మూవీ ఫిబ్రవరి 10వ తేదీ విడుదల అవుతుంది.
ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ మొదటిసారి  మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో  నటించి సందడి చేయబోతున్నారు.ఐతే ఇక ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ లో భాగంగా పెద్ద పెద్ద కార్యక్రమాలను నిర్వహించారు.ఈ మూవీ  ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కళ్యాణ్ రామ్ తన చేతి పై ఉన్న టాటూ వెనక ఉన్న సీక్రెట్ ను రివీల్ చేసారు.
కళ్యాణ్ రామ్ తన చేతి పై తన వైఫ్  స్వాతి పేరును టాటూగా వేయించుకున్నారు.అయితే తన భార్య పేరును టాటూగా వేయించుకోవడానికి గల కారణం ఏంటనే విషయాన్ని వస్తే గతంలో తాను తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురయ్యానని తెలిపారు.ఆ టైం లో అందరూ భార్యలు వారి భర్త పట్ల కేర్ తీసుకుంటారు కొందరు వారే చూసుకోగా మరి కొందరు నర్సులను పెడతారు.
ఐతే తన విషయంలో  స్వాతి మాత్రం నా దగ్గర ఉండి నాకు కావలసిన అవసరాలన్నింటినీ తీర్చారని కళ్యాణ్ రామ్ తెలిపారు.ఇక మా పెళ్లి రోజు నాడు తనకు ఏదైనా గిఫ్ట్ కావాలంటే అడగమని చెప్పగా తనకు నేను నా పిల్లలు పెద్ద గిఫ్ట్ అని చెప్పారు.అయితే ఆ టైం తనకు తన వైఫ్ పేరును ఎప్పటికీ గుర్తుండి పోయే విధంగా టాటూ వేయించుకోవాలని అనిపించిందని అందుకే ఈ టాటూ వేయించుకున్నానని తెలిపారు.నిజానికి నాకు సూదులు అంటే చాలా భయం కానీ స్వాతి పై ఉన్న ప్రేమతో ఇలా తన పేరును టాటూగా వేయించుకున్నానని మొదటిసారి తన టాటూ వెనుక ఉన్న సీక్రెట్ గురించి వెల్లడించారు.
దీన్ని బట్టి కళ్యాణరామ్ గారికి తన వైఫ్ మీద ఎంత ప్రేమ ఉందొ చెప్పకనే చెప్పారు అని నందమూరి అభిమానులు హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.ఈ విధంగా తన వైఫ్ మీద ప్రేమను చూపారు అని నేటిజన్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: