నందమూరి వారసులుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా మంచి పేరును తెచ్చుకున్నాడు. ఈయన అనంతరం మూడవ తరంలో జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రాములు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వారు కూడా హీరోలుగా మంచి గుర్తింపును పొందారు. నిజంగా చెప్పాలంటే నందమూరి బాలకృష్ణ కంటే ఎన్టీఆర్ కె ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు అనడంలో ఇలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే ఇక ఇద్దరికీ సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.
అది ఏంటి అంటే ఒకే కుటుంబానికి చెందిన బాబాయ్ మరియు కొడుకుల మధ్య ఒక చిన్న కోల్డ్ వార్ నడుస్తోంది అని తెలుస్తోంది. అయితే చాలాసార్లు బాలకృష్ణ కావాలని ఎన్టీఆర్ ని అవమానించడం జరిగింది.అంతేకాదు ఒకానొక సమయంలో బాలయ్య ఇన్ డైరెక్ట్ గా ఎన్టీఆర్ ని తిట్టడం కూడా జరిగింది.ఆ క్రమంలో ఒక సీనియర్ జర్నలిస్టు జూనియర్ ఎన్టీఆర్ ని బాలకృష్ణ కావాలని అవమానిస్తున్నాడు అని రాసుకొచ్చాడు. ఇక అసలు విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ తన తల్లిని ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కి తీసుకెళ్లడం జరిగింది. ఆ సమయంలో బాలకృష్ణ వారిద్దరిని బయటకు వెళ్ళమని చెప్పాడు. అవమానాన్ని తట్టుకోలేక జూనియర్ ఎన్టీఆర్ తన తల్లిని తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోయాడు.
దాని అనంతరం ఎన్టీఆర్ పట్టుదలతో స్టార్ హీరోగా ఈ స్థాయికి రావడం జరిగింది. స్టార్ స్టేటస్ ను పొందిన అనంతరం బాలకృష్ణ స్వయంగా వెళ్లి తన సినిమా ఫంక్షన్లకి గాను జూనియర్ ఎన్టీఆర్ ని దగ్గరుండి తీసుకొని వచ్చాడు. ఇది జరిగి చాలా కాలం అవుతున్నప్పటికీ తాజాగా ఇప్పుడు మళ్లీ రాజకీయాల కోసం ఎన్టీఆర్ కి బాలకృష్ణ దూరంగా ఉన్నాడని తెలుస్తోంది.ఏదో ఒక విధంగా జూనియర్ ఎన్టీఆర్ ని దూరం పెడుతూ వస్తున్నాడు బాలకృష్ణ. దీంతో ఎన్టీఆర్ ని దూరం పెట్టడం కరెక్ట్ కాదు అని బాలకృష్ణ పై మండిపడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. దీంతో ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ మరియు జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ వార్త కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!