జబర్దస్త్ కమెడియన్స్ లో పంచ్ ప్రసాద్ కి ఎవరు ఎక్కువ సహాయం చేశారో తెలుసా..!?

Anilkumar
జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పంచ్ ప్రసాద్  సుదీర్ఘకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రస్తుతం పంచ్ ప్రసాద్ అత్యంత ఖరీదైన చికిత్సను తీసుకుంటున్నాడు. ఆర్థికంగా బీదవాడైన పంచ్ ప్రసాద్కి జబర్దస్త్ కమెడియన్స్ చాలామంది ఆయన అనారోగ్యానికి గాను చాలా వరకు ఆర్థికంగా సహాయం చేస్తూనే ఉన్నారు. జబర్దస్త్ కమెడియన్ తో పాటు మల్లెమాల కూడా ఆయనకి ఎక్కువ అవకాశాలను ఇస్తూ మంచి రెమ్యూనరేషన్ ఇస్తూ ఉంటారు. తీవ్ర అనారోగ్య సమస్యను ఎదుర్కొంటూ కూడా నెలనెలా ఖరీదైన చికిత్సను తీసుకుంటూ కూడా పంచ ప్రసాద్ జబర్దస్త్ షోలో పాల్గొంటూ ఉంటాడు.

సాధారణంగా జబర్దస్త్ కమెడియన్స్ లో చాలామంది ప్రసాద్ కి ఇప్పటివరకు ఆర్థికంగా సహాయం చేశారు. అయితే దీనికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటి అండి జబర్దస్త్ కమెడియన్స్ లో చాలామంది పంచ్ ప్రసాద్కి ఆర్థికంగా సహాయం చేసినప్పటికీ అత్యధిక సహాయం చేసిన వారు మాత్రం సుడిగాలి సుధీర్ రాంప్రసాద్ మరియు గెటప్ శ్రీను అని తెలుస్తోంది.వీరు ముగ్గురే పంచ్ ప్రసాద్ కి దాదాపుగా 25 లక్షలు పైగానే కలిసి ఇచ్చారని తెలుస్తోంది. గతంలో సుడిగాలి సుదీర్ చాలా సహాయాలను చేశాడు. అంతేకాదు చాలామందికి ఆర్థికంగా కూడా సహాయం చేశాడు.

గతంలో సుడిగాలి సుధీర్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తనకి చాలా మంది సహాయం చేశారూ. అందుకే ఇప్పుడు ఆయన పంచ్ ప్రసాద్ కి తన వంతు సహాయాన్ని అందిస్తున్నాడు. కేవలం పంచ్ ప్రసాద్ కి మాత్రమే కాకుండా జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చిన చాలామందికి కూడా సుదీర్ తనవంతు సహాయాన్ని అందిస్తాడు. దీంతో ఈ వార్త విన్నానంతరం చాలామంది సుదీర్ ని ప్రశంసల వర్షంతో ముంచేస్తున్నారు. దీంతో పంచు ప్రసాద్ మరియు సుడిగాలి సుదీర్ కి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అవుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: