రాకేష్ - సుజాత మాత్రమే కాదు.. ఒక్కటవ్వబోతున్న మరో జబర్దస్త్ జంట?

praveen
ఇటీవల కాలం లో జబర్దస్త్ అనే కామెడీ షోలో ఎప్పుడు ఏదో ఒక జంట హైలెట్ గా మారి పోతూ ఉంటుంది అని చెప్పాలి. జబర్దస్త్ నిర్వాహకులు లేని లవ్ ట్రాక్ను పుట్టించి ప్రేక్షకులను ఆకర్షించి రేటింగ్స్ సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గతంలో సుధీర్, రష్మీ విషయం లో కూడా ఇలాగే చేశారు. అయితే ఇటీవల కాలం లో మాత్రం జబర్దస్త్ లో రియల్ జోడి కాస్త సందడి చేస్తుంది. సుజాత,  రాకింగ్ రాకేష్ పెళ్లి చేసుకో బోతున్నారు అన్న విషయం తెలిసిందే.

 అందరి లాగానే సుజాత, రాకింగ్ రాకేష్ జోడి కూడా జబర్దస్త్ స్టేజ్ పై ఒకరికి ఒకరు ప్రపోజ్ చేసుకోవడం.. ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ ఉంది అంటూ తమ భావాలను వ్యక్తం చేయడం చేశారు.  దీంతో ఎప్పటి లాగానే జబర్దస్త్ నిర్వహకులు రాకింగ్ రాకేష్, సుజాత మధ్య లవ్ ట్రాక్ క్రియేట్ చేశారని అందరూ భావించారు. కానీ వీరు నిజమైన ప్రేమ పక్షులు అన్న విషయం ఇటీవల వీరు ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత అందరికీ అర్థమైంది. మరికొన్ని రోజుల్లో పెళ్లి తో ఈ జంట ఒక్కటవుతుంది అన్న విషయం తెలిసిందే.

 అయితే గతం లో వర్ష, ఇమాన్యుల్ జోడి కూడా ఇలా ప్రేమ పక్షులుగా హడావిడి చేసిన వీరిది మాత్రం స్క్రిప్ట్ అని ప్రేక్షకులు నమ్మారు. అయితే ఇటీవల రాకింగ్ రాకేష్ ఎంగేజ్మెంట్ కు సంబంధించిన యూట్యూబ్ వీడియోని ఇటీవల పోస్ట్ చేసింది వర్ష. ఇందులో తాను కూడా త్వరలో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాను అంటూ అందరికీ హింట్ ఇచ్చేసింది. ఇలా రాకింగ్ రాకేష్, సుజాత మాత్రమే కాదు వర్ష, ఇమాన్యుల్ కూడా ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారని తెలుస్తుంది. మరోవైపు ఇమ్మాన్యూయల్ సైతం ఇక త్వర లో ఎంగేజ్మెంట్ ఉండబోతుందని ఫ్రెండ్స్ చెప్పకున్నాడట. ఏం జరగబోతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: