టాలీవుడ్ హీరోయిన్గా తనకంటూ ఒక మంచి పాపులారిటీని సంపాదించుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సమంత త్వరలోనే శకుంతలం అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో మళ్లీ తన అభిమానులను పలకరించడానికి సిద్ధంగా ఉంది.డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న భారీ అంచనాల నడుమ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పఠాన్ సినిమా ఇచ్చిన భారీ షాక్ తో ఈ సినిమా రిలీజ్ డేట్ ని వాయిదా వేసుకున్నారని తెలుస్తుంది. అయితే సమంత నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని మార్చి 27 కి పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లుగా తెలుస్తోంది.
అయితే ఈ నేపథ్యంలోనే సమంత తన సమయాన్ని వృధా చేయకుండా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన పనులను లైన్లో పెడుతుంది. ఈ నేపథ్యంలోనే సమంత బాలీవుడ్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న సిటాడిల్ వెబ్ సిరీస్ షూటింగ్లో పాల్గొంది. దీంతోపాటు త్వరలోనే శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఖుషి సినిమాలో సైతం పాల్గొనడానికి రెడీగా ఉంది సమంత. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఇటీవల విడుదల చేయడం జరిగింది. గత కొన్నాలుగా సమంత మయోసైటీస్ అనే వ్యాధితో బాధ పడుతున్న నేపథ్యంలో సమంత సినిమాలలో నటించదని సినిమాలకు బ్రేక్ ఇవ్వనుంది అంటూ సోషల్ మీడియా వేదికగా రకరకాల వార్తలు రావడం జరిగింది.
అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ తన మీద వస్తున్న ట్రోల్స్ కి ఎప్పటికప్పుడు పరోక్షంగా కౌంటర్ ఇస్తూనే వస్తోంది సమంత. అయితే తాజాగా సమంత పూర్తిగా కోరుకున్నట్లు తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సమంత తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను షేర్ చేస్తూ... ఒక దశలో నన్ను నేను కోల్పోయానని బాధపడ్డాను మనోధైర్యంతో అన్నిటిని ఎదిరించి సవాళ్లను ఎదుర్కొన్నాను.. అంటూ మయోసైటిస్ నుంచి పూర్తిగా కోరుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది సమంత...!!