ఏంటి.. జబర్దస్త్ వర్షకి ఎంగేజ్మెంట్ అయిపోయిందా..!?

Anilkumar
బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్గా తనకంటూ ఒక ప్రత్యేక సంపాదించుకుంది జబర్దస్త్ వర్షం. మొదట వర్ష పలు సీరియల్స్ లో నటించింది.అయినప్పటికీ తనకి సీరియల్స్ ద్వారా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది వర్ష. జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనంతరం మంచి గుర్తింపును అందుకోవడంతో పాటు అభిమానులను కూడా సొంతం చేసుకుంది వర్ష. అయితే ముఖ్యంగా వర్షం మరియు ఇమ్మానియేల్ చేసే కామెడీ సన్నివేశాల గురించి మాత్రమే జబర్దస్త్ చూసే వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

అంతే కాదు వీరిద్దరి మధ్య చూపించే లవ్ సన్నివేశాలు మరియు ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. సాధారణంగా జబర్దస్త్ వర్షా తనకి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా తన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా వర్షా తనకు ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటూ ఒక వీడియోను రిలీజ్ చేసి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే వర్ష కి నిజంగా ఎంగేజ్మెంట్ అయిందా లేదా కావాలని ఇలాంటి వీడియో పోస్ట్ చేసిందా అని ఆరాధిస్తున్నారు. బుల్లితెరపై తన గ్లామర్ తో అందరినీ ఆకట్టుకుంటున్న వర్షా అప్పుడప్పుడు తన అంద చందాలతో అందరినీ మైపారిపిస్తూ ఉంటుంది. 

జబర్దస్త్ షోలోనే కాకుండా ఇతర షోలలో సైతం పాల్గొంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది.అంతేకాదు కొన్ని షోలకి గెస్ట్ గా కూడా హాజరవుతూ ఉంటుంది వర్ష. బయటే కాకుండా వర్ష కి సోషల్ మీడియాలో కూడా చాలామంది ఫాన్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే ఇక ఇమాన్యుల్ మరియు వర్షాల మధ్య వచ్చే లవ్ సన్నివేశాలు మరియు ఎమోషనల్ సన్నివేశాల వల్ల ఎన్నోసార్లు ఈమె ట్రోలింగ్ కి గురైంది. ఈ సందర్భంగా వర్ష ఎన్నో సార్లు ఎమోషనల్ కూడా అయ్యింది.  తాజాగా తన యూట్యూబ్ ఛానల్ లో తన ఎంగేజ్మెంట్ అయ్యింది అంటూ ఒక వీడియోను షేర్ చేసింది వర్షా. అంతేకాదు ఆ వీడియోలో పెళ్లి కొడుకు ఎవరు అనే విషయాన్ని కూడా తెలియజేసింది. ఇక ఈ వీడియోని చూస్తే నిజంగానే వర్షపు ఎంగేజ్మెంట్ అయిపోయినట్లుగా కనిపిస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: