పవన్ ఆస్థి విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...?

murali krishna
తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్  కళ్యాణ్ ఒక తిరుగులేని హీరో.. మధ్యలో వరుసగా లు ఫ్లాపులు వచ్చిన కూడా ఆయన స్టార్ డమ్ మాత్రం కొంత కూడా తగ్గలేదు.. చిరంజీవి తమ్ముడిగా చిత్ర పరిశ్రమ కు పరిచయమైననప్పటికీ, పవర్ స్టార్‌గా తనకు తాను ఓ రేంజ్  ను ఏర్పాటు చేసుకున్నాడు పవన్.
ఆయన సినిమాలు చాలా కొత్తగా ఉంటాయి.. ఆయన స్టైల్ కూడా అంతకు మించి ఉంటుంది.. ఇక పవన్ వ్యక్తిత్వం గురించి చెప్పాల్సిన పని లేదు.. సాయం చేయడంలో ముందు ఉంటాడు.ఎంతోమందికి కూడా ఆయన గుప్త దానాలు కూడా చేశాడు. దేశం కోసం తన వంతు సాయం చేస్తాను అని ముందుకు వస్తారు..ప్రస్తుతం జనసేన పార్టీతో ప్రజల్లోకి వెళ్తున్నారు పవన్. మరోవైపు వరసబెట్టి సినిమాలు కూడా చేస్తున్నారు.
తెలుగులో టాప్ హీరోగా ఉన్న పవన్ ఒక్క సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ 50 నుంచి 60 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం.మరి ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్న పవన్.. ఆస్తుల విలువ ఎంత ఉంటుందన్నది చాలామందికి అనుమానం.ఈ విషయంపై క్లారిటీ కూడా ఇచ్చారు మెగా బ్రదర్ నాగబాబు. పవన్కు ఆస్తులకన్నా అప్పులే చాలా ఎక్కువగా ఉన్నాయంటూ బాంబ్ పేల్చారట.. పవన్ ఇల్లు కూడా లోన్‌పై తీసుకున్నదే అని ఆయన చెప్పుకొచ్చారు. పవన్కు కార్లు ఉన్నప్పటికీ అవి కూడా లోన్లో తీసుకున్నవేనని ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం ఎలాంటి లోన్లు మరియు అప్పులు లేకుండా ఉన్న ఆస్తి ఏదైనా ఉందంటే శంకర్ పల్లి వద్ద ఉన్న 8 ఎకరాల పొలమేనని ఆయన తెలిపారు. పవన్కు వ్యవసాయం చేయడమంటే ఎంతో ఇష్టమని .. దానికోసమే చాలా ఏళ్ల క్రితం 8 ఎకరాలను కొనుగోలు చేశారని ఆయన వివరించారు. పవన్ కొన్నప్పుడు ఆ భూమి 10 లక్షలు ఖరీదని కూడా చెప్పారు. పవన్ గతంలో తాను సంపాదించిన డబ్బును సేవా కార్యక్రమాల ఆయన కోసం వెచ్చించేవాడని.. ప్రజంట్ పార్టీ కోసం ఖర్చు చేస్తున్నాడని నాగబాబు తెలిపారట.. జానీ ఫ్లాప్ అయినప్పుడు కూడా తన రెమ్యూనరేషన్‌తో పాటు మరికొంత ఆ కొన్న డిస్ట్రిబ్యూటర్లకు పవన్ ఇచ్చేశాడని ఆయన చెప్పుకొచ్చారు. 8 ఎకరాల వ్యవసాయ భూమిని కూడా ఇచ్చేయడానికి రెడీ అయితే నేను తనని బలంవంతంగా ఆపానని నాగబాబు చెప్పడం జరిగింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: