శాకుంతలంతో ఆ రికార్డుని అంటిపెట్టుకున్న గుణశేఖర్?

Purushottham Vinay
ఇక సీనియర్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్‌ హాట్ బ్యూటి సమంత కాంబినేషన్‌లో వస్తున్న సినిమా "శాకుంతలం". ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 17 వ తేదీన విడుదల చేయాలని ముందుగా అనుకున్నారు.ఈ మేరకు ప్రచారం కూడా మేకర్స్ స్టార్ట్‌ చేశారు. ఇంటర్వ్యూలు, ప్రెస్‌ మీట్‌లు ఇంకా పాటలు కూడా లాంచ్‌ అయ్యాయి, ఇంకా అవుతున్నాయి కూడా. అయితే మరోవైపు ఈ సినిమా వాయిదా పడుతుంది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మాటలు ఎక్కడి నుండి వచ్చాయి, ఇంకా ఎలా వచ్చాయో తెలియదు కానీ.. వాయిదా పుకార్లు  భారీగా షికార్లు చేస్తున్నాయి. కానీ ఈ పూకార్లలో కూడా నిజం ఉందని సమాచారం తెలుస్తుంది. అయితే దీనికి కారణం ఓ బాలీవుడ్‌ సినిమా అని అంటున్నారు. 'అల వైకుంఠపురంలో' సినిమా రీమేక్‌ 'షెజాదా'ను వాయిదా వేశారు.'పఠాన్‌' వేడిలో కాలిపోకుండా టీమ్‌ ఫిబ్రవరి 10 నుండి 17కు ఫిక్స్ చేశారు. అందుకే ఈ సమస్య అంటున్నారు. 'శాకుంతలం' సినిమాను కూడా పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాకు హిందీలో ఎలాంటి ఇబ్బంది రాకుండా గుణశేఖర్ సినిమాను వెనక్కి నడిపిస్తున్నారట.


దానికితోడు 'శాకుంతలం' సినిమా ప్రమోషన్స్‌కు ఇప్పుడున్న స్పీడ్‌ కూడా చాలదు. అలాగే సమంత మేడం గారు కూడా తెలుగు వాళ్లకు అందుబాటులో లేదు. ఆమెదో పుట్టినప్పటి నుంచి బాలీవుడ్ హీరోయిన్ లాగా ఫీల్ అయిపోయి బాలీవుడ్ వెబ్ సిరీస్ తో బిజీగా ఉంది.ఇక ఈమె లేకుండా సినిమాను ప్రచారం చేసుకుంటే... సినిమాకి ఉన్న కొంచెం వాల్యూ కూడా పోతుంది.అందుకే కొంచెం సమయం తీసుకుంటే 'శాకుంతలం' సినిమాకు ప్రొమోషన్స్ బాగా చేయొచ్చు అని అనుకుంటున్నారట. అందుకే ఇప్పుడు వాయిదా వేసి.. మరో డేట్‌ కి రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారట. ఇక పోతే గుణశేఖర్ తీసిన ప్రతి సినిమా కూడా ముందుగా అనుకున్న డేట్ కి రిలీజ్ కాలేదు. ఇది ఆయనకి 30 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇక ఈ శాకుంతలం కళాఖండంతో కూడా తాను ముప్పై సంవత్సరాల నుంచి కాపాడుకుంటున్న ఈ పోస్ట్ పోన్ రిలీజ్ రికార్డుని ని అంతే అంటిపెట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: