ఆ సినిమాలే రాజమౌళి కి కొత్త సమస్యలని తెచ్చిపెట్టాయి..!?

Anilkumar
ఒక స్టార్ డైరెక్టర్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది అంటే తన తర్వాతే సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. ఇక ఆ ఒత్తిడి డైరెక్టర్లపై చాలా ప్రభావాన్ని చూపుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ ఒత్తిడి వల్ల చాలామంది డైరెక్టర్లు ఒకప్పుడు మంచి సినిమాలు అందించినప్పటికీ ఆ ఒత్తిడి వల్ల వారి తర్వాతే సినిమాలు అంతంత మాత్రానే ఉంటాయి. ఇదిలా ఉంటే ఇక బాహుబలి బాహుబలి 2 త్రిబుల్ ఆర్ సినిమాలతో ఊహించని స్థాయిలో గుర్తింపు పొందడు స్టార్ డైరెక్టర్ రాజమౌళి. గత పది ఏళ్లలో రాజమౌళి తీసిన సినిమాలు ఈ మూడే. 10 సంవత్సరాలలో మూడు సినిమాలే తెరకెక్కించినప్పటికీ ఆయన పేరు మాత్రం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. 

ఈ నేపథ్యంలోనే మహేష్ బాబుతో ఒక సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నాడు జక్కన్న. ఇక ఈ విషయంలో ఒకింత టెన్షన్ పడుతున్నారు అభిమానులు.అయితే ఈ క్రమంలోనే సినిమా రిజల్ట్ కి సంబంధించి సందేహం లేకపోయినప్పటికీ జక్కన్న గత మూడు సినిమాలకి గాను రికార్డును బ్రేక్ చేయడంలో టెన్షన్ పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన సినిమాలే రాజమౌళికి కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నాయని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోని రాజమౌళి తన సినిమాల వల్ల ఆయనకి వచ్చే సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకుంటాడో చూడాల్సి ఉంది. మార్చి నెల నుండి మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబినేషన్లో రాబోయే సినిమాకి సంబంధించిన షూటింగ్ మొదలుకానిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ అందరూ ఇదే జరుగుతుందని భావిస్తున్నారు.

ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుంటుందో చూడడానికి ఎదురుచూస్తున్నారు మహేష్ అభిమానులు. వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ సినిమా ఏకంగా 700 కోట్ల రూపాయలకు పైగానే బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా హాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేసినట్లుగా సమాచారం. అంతేకాదు వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది. హాలీవుడ్ యాక్షన్ సీక్వెన్స్ లో ఈ సినిమాలో భారీగా ఉంటాయని తెలుస్తోంది. అంతేకాదు తెలుగు ప్రేక్షకులు కాకుండా ఇతర దేశాల ప్రేక్షకుల సైతం ఈ సినిమాకి కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమా ని తెరకెక్కించనున్నాడు రాజమౌళి. ఈ క్రమంలోనే ఈ సినిమాకి గాను రాజమౌళి 150 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: