మెగాస్టార్ పెట్టుకున్న ఈ వాచ్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాబి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి మరియు శృతిహాసన్ లతోపాటు ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించాడు మాస్ మహారాజా రవితేజ. వీరితోపాటు ఈ సినిమాలో బాబీ సింహ, ప్రకాష్ రాజు వంటి వారు కొన్ని కీలక పాత్రలో నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 18న భారీ అంచనాల నడుమ విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే.

 కలెక్షన్ల పరంగా ఈ సినిమా ఒకసారి కొత్త రికార్డును క్రియేట్ చేసింది.జనవరి 13న విడుదలైన ఈ సినిమా 200 కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టింది. చిరంజీవి ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు గట్టి పోటీ చేస్తూ వరుస సినిమాలు చేస్తూ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది నటించిన ఆచార్య మరియు గాడ్ ఫాదర్ రెండు సినిమాలు  ఉన్నప్పటికీ వాల్తేరు వీరయ్య సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత భోళాశంకర్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి.

 ఈ నేపథ్యంలోనే త్వరలోనే మరొక సినిమాను కూడా చిరంజీవి ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే సాధారణంగా సినీ సెలబ్రిటీ లైఫ్ స్టైల్ మరియు లగ్జరీస్ గాడ్జెట్స్.. వారు వాడే మొబైల్స్ ...కార్లు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి తమ అభిమానులు ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇలా ఉంటే ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పెట్టుకున్న వాచ్ పైనే అందరి కళ్ళు పడ్డాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పెట్టుకొని లగ్జరీస్ వాచ్ ధర సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్భంగా పెట్టుకున్న వాచ్ రోలెక్స్ కాస్మోగ్రఫీ వైట్ టైగర్  1,86,91,361   అని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: