కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇటీవల ఆయన నటించిన వరిసు సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దళపతి విజయ్ హీరోగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తన కెరీర్లు 67వ సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో చేయనున్నాడు. ఇక ఈ విషయాన్ని నిన్ననే మేకర్స్ అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. ఇక జనవరి రెండవ తేదీ నుండి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.
కాగా ఈ సినిమాకి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ కాశ్మీర్లో జరగబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర బృందం అంతా కలిసి ఈరోజు ఉదయం కాశ్మీర్ కి బయలుదేరి వెళ్లడం జరిగింది. అది కూడా ఒక ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్లో. ఇదిలా ఉంటే ఇక అసలు విషయం ఏంటంటే... ఈ ఎయిర్పోర్ట్ బోర్డింగ్ స్క్రీనింగ్ లో హీరోయిన్లు త్రిష మరియు ప్రియా ఆనంద్ పేర్లు కూడా డిస్ప్లే అవ్వడం జరిగింది. అయితే దీంతో త్రిష మరియు ప్రియా ఆనంద్ కూడా ఈ సినిమాలో ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు త్రిష మరియు ప్రియా ఆనంద్ ఈ సినిమాలో విజయ్ కి జోడిగా నటించబోతున్నారు అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన కూడా లేదు. ఈ విషయం నిజమా కాదా అన్నది తెలియాలి అంటే ఈ సినిమా చిత్ర బృందం అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంది.7 స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై యస్ లలిత కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో నటినటులు ఎవరు మరియు కీలకపాత్రలో ఎవరైనా నటిస్తున్నారు అన్న విషయాలు ఇంకా చిత్రబంధం చెప్పలేదు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుంది..!!